Glenn Maxwell: ఆసీస్ జట్టుపై పిడుగు.. స్టార్ ఆల్ రౌండర్ లేకుండానే టీ20 సిరీస్‌కు..
ఇప్పుడు మాక్స్‌వెల్ జట్టులో లేకపోవడంతో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ మాథ్యూ వేడ్‌కు ఆసీస్ జట్టులో అవకాశం కల్పించారు. టీ20 ప్రపంచకప్ 2022లో చివరిసారిగా ఆసీస్ తరపున ఆడిన వేడ్ ఆ తర్వాత ఆసీస్ జట్టులో కనిపించలేదు.

Glenn Maxwell: ప్రపంచకప్ సమీపిస్తున్న తరుణంలో ప్రస్తుత టీ20 ప్రపంచకప్ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ ఎడమ చీలమండ గాయంతో దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు.
ఇప్పుడు మాక్స్‌వెల్ జట్టులో లేకపోవడంతో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ మాథ్యూ వేడ్‌కు ఆసీస్ జట్టులో అవకాశం కల్పించారు. టీ20 ప్రపంచకప్ 2022లో చివరిసారిగా ఆసీస్ తరపున ఆడిన వేడ్ ఆ తర్వాత ఆసీస్ జట్టులో కనిపించలేదు. నిజానికి రాబోయే దక్షిణాఫ్రికా సిరీస్‌కు దూరమైన ఏకైక ఆటగాడు మ్యాక్స్‌వెల్ కాదు. మ్యాక్స్‌వెల్ కంటే ముందు, కెప్టెన్ పాట్ కమిన్స్, స్టీవెన్ స్మిత్, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, కామెరాన్ గ్రీన్, డేవిడ్ వార్నర్‌లతో సహా ఇతర స్టార్ ఆటగాళ్లు ఆఫ్రికా పర్యటనకు దూరమయ్యారు.
ఈ విషయంలో ఆసీస్ జట్టు సభ్యుడు టోనీ డోడెమైడ్ మాక్స్‌వెల్ గాయం గురించి తెలియజేస్తూ, మాక్స్‌వెల్ కోలుకునేలా చూస్తామని, తద్వారా అతను ప్రపంచకప్‌నకు ముందు భారతదేశంలో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉంటాడని చెప్పుకొచ్చాడు. కాగా, సౌత్ ఆఫ్రికాతో జరగనున్న సిరీస్‌కు మిచెల్ మార్ష్ నాయకత్వంలో ఆసీస్ జట్టు కాలు దువ్వనుంది.