England Vs Australia: ఎందుకు మావా కక్కుర్తి ఇంకో చూయింగ్ గమ్ తినొచ్చుగా
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ చేసిన ఓ పనిని చూసి నెటిజన్లు యాక్ తూ.. అంటున్నారు. ఛీ.. ఛీ ఇదేం పనంటూ అసహించుకుంటున్నారు.

Another interesting incident happened in the Ashes Trophy when Marnus Labushane's chewing gum fell out of his mouth
ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్ తొలి రోజు ఆటలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఇంతకేం జరిగిందంటే.. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ సందర్భంగా బ్యాటింగ్ చేసే క్రమంలో మార్నస్ లబుషేన్ నోట్లోని చూయింగమ్ కిందపడిపోయింది. వెంటనే అతను దాన్ని వదిలేయకుండా.. తీసి మళ్లీ నోట్లో వేసుకున్నాడు. ఇది టీవీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ఆసీస్ ఇన్నింగ్స్ 45వ ఓవర్‌కు ముందు ఈ ఘటన చోటు చేసుకుంది. స్ట్రైకింగ్ అతనిదే కావడంతో గ్లోవ్స్‌తో పాటు హెల్మెట్ పెట్టుకునే క్రమంలో చూయింగమ్ కిందపడగా.. మార్నస్ లబుషేన్ దాన్ని తీసుకొని నోట్లో వేసుకున్నాడు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఛీ.. యాక్ తూ అని కొందరంటే.. అంత కక్కుర్తి ఏందిరా? అంటూ మరొకరు ప్రశ్నిస్తున్నారు.