రోహిత్ ఖాతాలో మరో రికార్డ్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. అత్యధిక సార్లు ఫిఫ్లీ ప్లస్ స్కోర్లు చేసిన భారత ఓపెనర్‌గా చరిత్రకెక్కాడు. శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. రోహిత్ శర్మకు భారత ఓపెనర్‌గా ఇది 121వ 50 ప్లస్ స్కోర్. ఈ క్రమంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును రోహిత్ శర్మ అధిగమించాడు. సచిన్ టెండూల్కర్ భారత ఓపెనర్‌గా 120 సార్లు 50 ప్లస్ రన్స్ చేశాడు. ఈ మ్యాచ్ మరికొన్ని రికార్డులను కూడా హిట్ మ్యాన్ అందుకున్నాడు. గతేడాది జనవరి నుంచి ఇప్పటి వరకు వన్డే క్రికెట్‌లో తొలి 10 ఓవర్లో అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాటర్‌గా రోహిత్ శర్మ అగ్రస్థానంలో నిలిచాడు. అలాగే వన్డే క్రికెట్‌లో తొలి 10 ఓవర్లలోనే అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన బ్యాటర్ గానూ రికార్డ్ సృష్టించాడు.