Hardik Pandya : హార్దిక్ కు డబుల్ షాక్
ఐపీఎల్ 17వ సీజన్‌ను ఓటమితో ముగించిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యకు మరో షాక్ తగిలింది. పేలవ కెప్టెన్సీతో సీజన్ మొత్తం నిరాశ పరిచిన అతనికి ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ షాక్ ఇచ్చింది.

Another shock for Mumbai Indians captain Hardik Pandya who ended the 17th season of IPL with a defeat.
ఐపీఎల్ 17వ సీజన్‌ను ఓటమితో ముగించిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యకు మరో షాక్ తగిలింది. పేలవ కెప్టెన్సీతో సీజన్ మొత్తం నిరాశ పరిచిన అతనికి ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ షాక్ ఇచ్చింది. మినిమమ్ ఓవర్ రేట్‌ను ఉల్లంఘించినందుకు కెప్టెన్ హార్దిక్ పాండ్యపై ఒక మ్యాచ్ వేటు వేస్తున్నట్లు ప్రకటించింది. మ్యాచ్ సస్పెన్షన్‌తోపాటు 30 లక్షల జరిమానాను విధించింది. తుది జట్టులోని ఇతర ఆటగాళ్లకూ 12 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 50 శాతం ఏది తక్కువైతే దానిని ఫైన్ విధిస్తూ కమిటీ నిర్ణయం తీసుకుంది. నిర్ణీత సమయంలోగా ఓవర్లను పూర్తి చేయడంలో ముంబై విఫలమయింది. ఈ సీజన్ లో ఆ జట్టు చేసిన మూడో తప్పిదం. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనల ప్రకారం మూడో సారి స్లో ఓవర్ రేట్ రూల్ ఉల్లంఘిస్తే ఒక మ్యాచ్ వేటుతోపాటు జరిమానా కూడా పడుతుంది. ఇప్పుడీ నిర్ణయంతో వచ్చే సీజన్‌లో పాండ్య ముంబై ఆడే తొలి మ్యాచ్‌కు అందుబాటులో ఉండడు.