రంజీ బాటలో మరో స్టార్ క్రికెటర్ ,హర్యానాపై ఆడేందుకు రాహుల్ రెడీ
టీమిండియా స్టార్ క్రికెటర్లంతా రంజీ బాట పట్టారు. జాతీయ జట్టుకు మ్యాచ్ లు లేనప్పుడు ఎవరైనా సరే దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ ఆదేశించడంతో కెప్టెన్ రోహిత్ శర్మ, కోహ్లీ, పంత్, గిల్, జైశ్వాల్ వంటి స్టార్ ప్లేయర్స్
టీమిండియా స్టార్ క్రికెటర్లంతా రంజీ బాట పట్టారు. జాతీయ జట్టుకు మ్యాచ్ లు లేనప్పుడు ఎవరైనా సరే దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ ఆదేశించడంతో కెప్టెన్ రోహిత్ శర్మ, కోహ్లీ, పంత్, గిల్, జైశ్వాల్ వంటి స్టార్ ప్లేయర్స్ రంజీలు ఆడుతున్నారు. తాజాగా ఈ జాబితాలో కేఎల్ రాహల్ కూడా చేరాడు. జనవరి 30న ప్రారంభమయ్యే మ్యాచ్‌కు అందుబాటులో ఉంటానని వెల్లడించాడు.
రాహుల్ కర్ణాటక తరఫున బరిలోకి దిగుతాడు. ఈనెల 30న ప్రారంభమయ్యే మ్యాచ్‌లో కర్ణాటక.. హర్యానాను ఢీకొంటుంది.
నిజానికి రాహుల్ తొలి మ్యాచ్ లోనే బరిలోకి దిగాల్సి ఉన్నప్పటకీ…మోచేతి గాయం కారణంగా దూరమయ్యాడు. వచ్చే వారానికి గాయం నుంచి పూర్తిగా కోలుకోనున్న రాహుల్ హర్యానాతో మ్యాచ్ లో ఆడేందుకు నిర్ణయించుకున్నాడు. ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ కు ముందు రంజీ మ్యాచ్ లు వీరందరికీ ప్రాక్టీస్ గా ఉపయోగపడనున్నాయి.