Asia Cup : దుమ్మురేపిన భారత్.. ఆసియాకప్ లో మరో విజయం
ఆసియా కప్ లో భారత మహిళల జట్టు దుమ్మురేపుతోంది. తొలి మ్యాచ్ లో పాక్ ను చిత్తు చేసిన భారత్ తాజాగా యూఏఈపై ఘనవిజయం సాధించింది.

Another victory in the Asia Cup
ఆసియా కప్ లో భారత మహిళల జట్టు దుమ్మురేపుతోంది. తొలి మ్యాచ్ లో పాక్ ను చిత్తు చేసిన భారత్ తాజాగా యూఏఈపై ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన భారత మహిళల జట్టు 201 పరుగుల భారీ స్కోర్ చేసింది. హర్మన్ ప్రీత్ కౌర్ హాఫ్ సెంచరీ చేయగా… చివర్లో రిఛా ఘోష్ మెరుపు ఇన్నింగ్స్ తో విరుచుకుపడింది. కేవలం 29 బంతుల్లోనే 12 ఫోర్లు, 1 సిక్సర్ తో 64 పరుగులు చేసింది. హర్మన్ ప్రీత్ 66 పరుగులు చేయగా…అంతర్జాతీయ టీ ట్వంటీల్లో 200 ప్లస్ స్కోర్ చేయడం భారత్ కు ఇదే తొలిసారి. తర్వాత బౌలింగ్ లోనూ అదరగొట్టిన భారత్ యూఏఈని 123 పరుగులకే పరిమితం చేసింది. ఈ టోర్నీలో భారత మహిళల జట్టుకు ఇది వరుసగా రెండో విజయం.