అమ్మా అనుష్క శర్మ.. ఆ బూతులేంటి తల్లి..? అన్నీ మైదాపిండి మాటలే..!
టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఇప్పుడు గాల్లో తేలిపోతున్నారు. గతేడాది టి 20 వరల్డ్ కప్ గెలిచారు.. ఇప్పుడు చాంపియన్స్ ట్రోఫీ-2025 కూడా సొంతం చేసుకున్నారు..

టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఇప్పుడు గాల్లో తేలిపోతున్నారు. గతేడాది టి 20 వరల్డ్ కప్ గెలిచారు.. ఇప్పుడు చాంపియన్స్ ట్రోఫీ-2025 కూడా సొంతం చేసుకున్నారు.. 2023 వరల్డ్ కప్ కూడా గెలిచుంటే వరసగా మూడు సంవత్సరాల్లో మూడు ఐసిపి టైటిల్స్ నెగ్గిన మొదటి జట్టుగా ఇండియన్ క్రికెట్ టీం రికార్డు క్రియేట్ చేసేది.. కానీ కొద్దిలో ఆ ఫైనల్ మ్యాచ్ మిస్ అయింది.. ఆ ఓటమికి అయిన గాయానికి మందు రాయడానికే వరసగా మనోళ్లు టి 20, ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచి చూపించారు. తాజాగా న్యూజిలాండ్, ఇండియా మధ్య జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు భారీగా తరలివచ్చారు సెలెబ్రిటీలు. దుబాయ్‌లో జరిగిన ఈ మ్యాచ్ కోసం ఇండియా నుంచి చాలా మంది అభిమానులు వెళ్లారు. ఇక ఇండస్ట్రీ నుంచి కూడా ఎంతోమంది వచ్చారు.
ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ నిన్న మ్యాచ్‌లో జరిగిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. టీమిండియా దిగ్గజ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ సతీమణి, హీరోయిన్ అనుష్క శర్మ చేసిన కామెంట్స్ ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. ఆమెను టార్గెట్ అయ్యేలా చేస్తున్నాయి. ఇంతకీ అంతగా ఆమె ఏం చేసింది అనుకోవచ్చు కానీ అమ్మడు అందరూ చూస్తుండగానే ఏకంగా మైదాపిండి బూతులు వాడేసింది. కోహ్లీ సతీమణి కావడంతో స్టేడియంలో కెమెరాలు పదే పదే ఆమె వైపు వెళ్లాయి. వద్దన్నా ఆమెను చూపిస్తేనే ఉంటారు కెమెరామెన్లు కూడా. అలా చూపిస్తున్నపుడే ఈ బ్యూటీ నోటి నుంచి బూతులు అలా జాలువారాయి. సెన్సేషనల్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయస్ అయ్యర్‌ను అనుష్క అమ్మనా బూతులు తిట్టడమే ఈ విమర్శలకు కారణమైంది.
అసలు మ్యాటర్ ఏంటంటే.. నిన్నటి ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ రచిన్ రవీంద్ర ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ దగ్గర అందుకోవడంలో విఫలమయ్యాడు శ్రేయాస్. దీంతో గ్యాలరీలో కూర్చున్న అనుష్క శర్మ బూతులు తిడుతూ తన అసహనాన్ని ప్రదర్శించింది. మిస్ చేసినందుకు నిరుత్సాహం వరకు ఓకే గానీ నోటి నుంచి వచ్చిన మాటలే డీకోడ్ అయ్యాయిప్పుడు. కాస్త కాన్సట్రేషన్ చేస్తే అనుష్క ఏం తిట్టిందనేది ఈజీగా అర్థమైపోతుంది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయిప్పుడు. దీన్ని చూసిన నెటిజన్స్.. క్యాచ్ వదిలితే మాత్రం ఇలా తిట్టడం సరైనదేనా అని కామెంట్స్ చేస్తున్నారు. విచిత్రమేంటంటే.. మొన్న సెమీ ఫైనల్ మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ ఫీల్డింగ్ మిస్ చేసాడని విరాట్ కోహ్లీ కూడా అతన్ని అమ్మనా బూతులు తిట్టాడు.. ఇప్పుడు సతీమణి కూడా ఇదే చేసి భర్తకు తగ్గ భార్య అనిపించుకుంది.