ఆర్చర్ కు దూల తీర్చేశారుగా, వాయించి వదిలిపెట్టిన భారత్

ఏదో లక్కీగా గెలిచారు.. తొలి టీ ట్వంటీలో భారత్ విజయం తర్వాత ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ చేసిన కామెంట్స్ ఇవీ..మొదటి టీ20లో భారత బ్యాటర్లకు లక్ కలిసొచ్చిందని..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 27, 2025 | 03:30 PMLast Updated on: Jan 27, 2025 | 3:30 PM

Archers Comments Were Strongly Countered By Our Fans On Social Media

ఏదో లక్కీగా గెలిచారు.. తొలి టీ ట్వంటీలో భారత్ విజయం తర్వాత ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ చేసిన కామెంట్స్ ఇవీ..మొదటి టీ20లో భారత బ్యాటర్లకు లక్ కలిసొచ్చిందని.. రెండో మ్యాచ్‌లో మాత్రం వారిని వదిలే ప్రసక్తే లేదంటూ వార్నింగ్ ఇచ్చాడు. చాలా బంతులు గాల్లోకి లేచాయని.. అయితే పలు మిస్ క్యాచ్‌లు జరగడం, మరికొన్ని బంతులు ఫీల్డర్లకు దూరంగా గ్యాప్స్‌లో పడటంతో టీమిండియా బ్యాటర్లు బతికిపోయారంటూ ఎగతాళిగా మాట్లాడాడు. ఒకవేళ క్యాచులన్నీ పట్టినా, ఫీల్డర్ల చేతుల్లో ఆ బంతులన్నీ వచ్చినా భారత టాప్, మిడిలార్డర్‌ను 40 పరుగులకే కట్టడి చేసేవారమని వ్యాఖ్యానించాడు. అయితే ఆర్చర్ కామెంట్స్ కు సోషల్ మీడియాలో మన ఫ్యాన్స్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. మీకు బ్యాటింగ్ చేతకాకుంటే ప్రత్యర్థి లక్కీగా గెలిచినట్టా అంటూ ఫైర్ అయ్యారు.

అయితే ఆర్చర్ కామెంట్స్ కు భారత క్రికెటర్లు నోటితో కాకుండా ఆటతో జవాబిచ్చారు. రెండో టీ ట్వంటీలో ఈ ఇంగ్లాండ్ పేసర్ ను ఉతికారేశారు. తొలి ఓవర్లోనే అభిషేక్ శర్మ మూడు ఫోర్లు బాదేయగా… ఐదో ఓవర్లో అయితే తిలక్ వర్మ అతనికి చుక్కలు చూపించాడు. రెండు సిక్సర్లు, ఒక ఫోర్ తో సహా మొత్తం 17 రన్స్ బాదాడు. అలాగే చివర్లో సైతం విరుచుకుపడ్డాడు. 16వ ఓవర్లో 2 సిక్సర్లతో సహా 19 పరుగులు పిండుకున్నాడు. ఓవరాల్ గా ఈ మ్యాచ్ లో నాలుగు ఓవర్ల స్పెల్ లో ఏకంగా 60 పరుగులు ఇచ్చేసిన ఆర్చర్ ఒక వికెట్ తీశాడు. అనవసరంగా రెచ్చగొట్టి కొట్టించుకున్నాడంటూ భారత ఫ్యాన్స్ ఆర్చర్ కు కౌంటర్ ఇస్తున్నారు. బాగా తీరిందా అంటూ ఈ ఇంగ్లాండ్ పేసర్ ను ఓ ఆటాడుకుంటున్నారు.

ఇదిలా ఉంటే పొగమంచు వల్ల తొలి టీ ట్వంటీలో తాము సరిగ్గా బ్యాటింగ్ చేయలేకపోయామంటూ మాట్లాడిన ఇంగ్లాండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ ను సైతం భారత ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. కోల్‌కతాలోని పొగమంచు కారణంగా భారత బౌలర్ల లైన్, లెంగ్త్‌లను సమర్థవంతంగా అంచనా వేయలేకపోయామని చెప్పాడు.
అయితే రెండో టీ20లోనూ వరుణ్ చక్రవర్తీ బౌలింగ్‌లోనే హ్యారీ బ్రూక్ క్లీన్ బౌల్డ్ అవ్వడంతో గవాస్కర్ సెటైర్లు పేల్చాడు. అతను ఔటైన వెంటనే ఇక్కడ స్పష్టమైన వెలుతురు ఉంది. ఎలాంటి పొగమంచు లేదు కదా అంటూ ఎగతాళి చేశాడు. తొలి టీట్వంటీలోనూ బ్రూక్ ను వరుణ్ చక్రవర్తినే పెవిలియన్ కు పంపాడు.