స్పిన్నర్లే విన్నర్లా ? దుబాయ్ పిచ్ రిపోర్ట్ ఇదే

ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్ కు భారత్ రెడీ అయింది. బంగ్లాదేశ్ తో గురువారం దుబాయ్ వేదికగా తలపడబోతోంది. ఈ మ్యాచ్ పూర్తి ఆధిపత్యం కనబరిచి గెలవడం ద్వారా టోర్నీని ఘనంగా ఆరంభించాలని భావిస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 20, 2025 | 01:54 PMLast Updated on: Feb 20, 2025 | 1:54 PM

Are Spinners Winners This Is The Dubai Pitch Report

ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్ కు భారత్ రెడీ అయింది. బంగ్లాదేశ్ తో గురువారం దుబాయ్ వేదికగా తలపడబోతోంది. ఈ మ్యాచ్ పూర్తి ఆధిపత్యం కనబరిచి గెలవడం ద్వారా టోర్నీని ఘనంగా ఆరంభించాలని భావిస్తోంది. అదే సమయంలో బంగ్లాదేశ్ ను తక్కువ అంచనా వేస్తే మాత్రం ఇబ్బందులు తప్పవు. గత రికార్డుల ప్రకారం టీమిండియానే ఫేవరెట్ గా బరిలోకి దిగుతుండగా.. తుది జట్టు కూర్పుపై దాదాపు క్లారిటీ వచ్చినట్టే కనిపిస్తోంది. అయితే మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న దుబాయ్ ఎలా ఉండబోతుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దుబాయ్ పిచ్ పై కెప్టెన్ రోహిత్ శర్మకు సైతం స్పష్టత లేకపోవడం ఆశ్చర్యపరుస్తోంది. పిచ్ ను చూసామని కానీ స్లో బౌలర్లకు అనుకూలిస్తుందా లేదా అన్నది పూర్తిగా తెలియడం లేదంటూ వ్యాఖ్యానించాడు. ముగ్గురు స్పిన్నర్లా… ముగ్గురు పేసర్లా అన్నది మ్యాచ్ కు ముందు నిర్ణయిస్తామన్నాడు.

ఇదిలా ఉంటే దుబాయ్ పిచ్ సహజంగా స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. పూర్తిస్థాయిలో కాకున్నా మ్యాచ్ సాగే కొద్దీ స్లో బౌలర్లు ప్రభావం చూపిస్తారు. అదే సమయంలో మంచు ప్రభావం ఉండనుండడంతో టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్ కే మొగ్గుచూపొచ్చు. కానీ మ్యాచ్ ఆరంభంలో పేసర్లు కొత్త బంతితో ప్రభావం చూపించే అవకాశముంటుంది. బ్యాటర్లు క్రీజులో కుదురుకుంటే మిడిల్ ఓవర్స్ లో పరుగులు చేసేందుకు వీలుంటుందని అంచనా. దుబాయ్ స్టేడియంలో ఇప్పటి వరకూ 58 వన్డేలు జరగ్గా యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 218 రన్స్ గా ఉంది. ఈ స్టేడియంలో మొదట బ్యాటింగ్ కు దిగిన జట్టు 22 సార్లు, ఛేజింగ్ టీమ్స్ 34 సార్లు గెలిచాయి. దీని ప్రకారం చూసుకుంటే టాస్ కీలకం కానుంది. ఈ పిచ్ పై 250 ప్లస్ మంచి స్కోరుగా అంచనా వేస్తున్నారు.

కాగా భారత తుది జట్టులో వికెట్ కీపర్ గా కేఎల్ రాహుల్ కే బాధ్యతలు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. దీనిపై పంత్ కూ , గంభీర్ కూ మధ్య కాస్త హాట్ డిస్కషన్ కూడా జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. మరోవైపు తుది జట్టులో ముగ్గురు స్పిన్నర్లు , ఇద్దరు స్పిన్నర్ల వ్యూహమే బాగుంటుందన్న అంచనాలున్నాయి. స్పిన్ ఆల్ రౌండర్ గా అక్షర్ పటేల్, జడేజాలకు తోడు ప్రధాన స్పిన్నర్ గా కుల్దీప్ ను తీసుకునే ఛాన్స్ ఉంది. అటు పేస్ ఎటాక్ లో షమీ, అర్షదీప్ లకు చోటు దక్కనుండగా… హర్షిత్ రాణా బెంచ్ కే పరిమితయ్యే అవకాశముంది.