DHANA DHAN DHONI : నీకు 42 యేళ్ళా..? చిన్నప్పుడు ఏం తిన్నారు !
IPL లో మహేంద్ర సింగ్ ధోనీ అదరగొడుతున్నాడు. ఎంతసేపు ఆడామన్నది కాదు.. ఎలా ఆడామా అన్నదే ముఖ్యం అన్నట్టుగా చెలరేగిపోతున్నాడు. బౌండరీల మోత మోగిస్తున్నాడు. నిన్నటి మ్యాచ్‌లో 101 మీటర్ల సిక్స్ కొట్టాడు..
IPL లో మహేంద్ర సింగ్ ధోనీ అదరగొడుతున్నాడు. ఎంతసేపు ఆడామన్నది కాదు.. ఎలా ఆడామా అన్నదే ముఖ్యం అన్నట్టుగా చెలరేగిపోతున్నాడు. బౌండరీల మోత మోగిస్తున్నాడు. నిన్నటి మ్యాచ్‌లో 101 మీటర్ల సిక్స్ కొట్టాడు.. ఈ జార్ఖండ్ డైనమేట్. 42 యేళ్ళు దాటిన ధోనీ ఆటతీరు చూస్తుంటే… యంగ్ ప్లేయర్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు.
ఐపీఎల్‌లో.. తఢాఖా చూపిస్తున్నాడు ధనా ధన్. ఇన్నింగ్స్ చివర్లో బ్యాటింగ్‌కు వస్తున్నా.. ఫ్యాన్స్‌కు ఫుల్ జోష్ ఇస్తున్నాడు. సిక్సుల మోత మోగిస్తున్నాడు. లక్నోతో జరిగిన మ్యాచ్‌లో 9 బాల్స్‌లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 28 రన్స్ చేశాడు ధోనీ. ఇందులో 101 మీటర్ల సిక్స్ కూడా ఉండటం విశేషం. ఐపీఎల్‌లో.. ఇది ధోనీ లాంగెస్ట్ సిక్స్.
పరుగుల మోత మోగుతున్న ఈ సీజన్‌లో లాంగెస్ట్ సిక్స్ కొట్టిన రికార్డు దినేశ్ కార్తీక్ పేరిట ఉంది. కార్తీక్ 108 మీటర్ల సిక్స్ కొడితే.. పూరన్, క్లాసెన్, వెంకటేశ్ అయ్యర్.. 106 మీటర్ల సిక్స్‌లు కొట్టారు. ఓవరాల్‌గా ఐపీఎల్‌లో లాంగెస్ట్ సిక్స్ కొట్టిన రికార్డు.. ఆల్బీ మోర్కెల్ పేరిట ఉంది. మోర్కెల్ 2008 సీజన్‌లో 125 మీటర్ల సిక్స్ కొట్టాడు. ఆ తర్వాత ఈ లిస్టులో 124 మీటర్లతో ప్రవీణ్ కుమార్, 122 మీటర్లతో గిల్‌క్రిస్ట్, 120 మీటర్లతో ఊతప్ప, 119 మీటర్లతో క్రిస్ గేల్ ఉన్నారు.
ఐపీఎల్‌లో 20th ఓవర్ అంటే.. ధోనీ ఫ్యాన్స్‌కు పూనకాలు లోడింగే. ఎందుకంటే ఈ స్టార్ బ్యాట్స్‌మెన్ ఆటతీరు అలా ఉంటుంది. ఇప్పటివరకు ఇన్నింగ్స్ 20వ ఓవర్లలో 313 బంతులు ఆడిన ధోనీ.. 772 రన్స్ చేశాడు. ఇందులో 53 ఫోర్లు, 65 సిక్సులు ఉన్నాయి. ఈ రికార్డు దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు.. 42 ఏళ్ల వయస్సులోనూ ధోని తన ట్రేడ్ మార్క్ షాట్లతో అభిమానులను అలరిస్తున్నాడు. ధోనీ తన కెరీర్ ఆరంభంలో ఎలాగైతే.. డేర్ అండ్ ఢాషింగ్ షాట్లు ఆడేవాడో.. ఈ సీజన్‌లోనూ అలాగే విరుచుకుపడుతున్నాడు. తగ్గేదేలే అంటూ ముందుకు సాగుతున్న ధోనీ.. క్రీజ్‌లో అడుగుపెడుతుంటే స్టేడియం హోరెత్తిపోతోంది. ఢిల్లీపై 16 బంతుల్లోనే 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులు చేసిన ధోనీ.. ముంబైపై 4 బంతుల్లోనే 20 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ సీజన్‌లో 5 ఇన్నింగ్స్‌లో 255 స్ట్రైక్ రేట్‌తో 87 రన్స్ సాధించాడు. అంతేకాకుండా ఐపీఎల్‌లో 5 వేల పరుగుల మైలురాయిని అధిగమించాడు ధోనీ.