క్రికెట్ లో ఫీల్డింగ్ కు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా బ్యాటర్లు ఇచ్చే కొన్ని క్యాచ్ లను అందుకోవాలంటే అద్భుత విన్యాసాలు చేయాల్సిందే.. తాజాగా శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ క్రికెటర్ నాథన్ స్మిత్ సంచలన క్యాచ్ తో మెరిశాడు. బౌండరీ దగ్గర విన్యాసం చేస్తూ ఊహకందని క్యాచ్ తో ఆశ్చర్యానికి గురి చేశాడు. శ్రీలంక ఆటగాడు ఇషా మలింగ భారీ షాట్ ఆడగా. బౌండరీ ఖాయమన్న దశలో నాథన్ స్మిత్ శరవేగంగా వచ్చి బంతిని అందుకున్నాడు. థర్డ్ మ్యాన్ కు దూరంగా ఉన్న ఈ కివీస్ క్రికెటర్ క్యాచ్ కోసం చాలా దూరం పరిగెత్తి ఫుల్ లెంగ్త్ డైవ్ చేసి పట్టుకున్నాడు. దీంతో క్రికెట్ చరిత్రలోనే ఇది బెస్ట్ క్యాచ్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వర్షం కారణంగా 37 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ విజయం సాధించింది.[embed]https://www.youtube.com/watch?v=dE9bOatf-9I&pp=ygULZGlhbCBzcG9ydHM%3D[/embed]