మరో మూడు వికెట్లే అరుదైన రికార్డ్ ముంగిట అర్షదీప్
టీమ్ఇండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అరుదైన ఘనత ముంగిట నిలిచాడు. ఇంగ్లాండ్ తో రెండో టీ ట్వంటీలో ఈ పేసర్ మరో మూడు వికెట్లు తీస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో టీ20ల్లో 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా చరిత్ర సృష్టిస్తాడు.
టీమ్ఇండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అరుదైన ఘనత ముంగిట నిలిచాడు. ఇంగ్లాండ్ తో రెండో టీ ట్వంటీలో ఈ పేసర్ మరో మూడు వికెట్లు తీస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో టీ20ల్లో 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. అంతేకాదు అత్యంత వేగంగా వంద వికెట్లు తీసిన పేసర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలుస్తాడు.
అర్ష్‌దీప్ సింగ్ ఇప్పటికే అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా కొనసాగుతున్నాడు. 2022లో టీ20ల్లో అరంగ్రేటం చేసిన అర్ష్‌దీప్ కేవలం 61 మ్యాచుల్లోనే 97 వికెట్లు సాధించాడు. ఈ క్రమంలో అతడు పాకిస్థాన్ పేసర్ హారిస్ రవూఫ్ రికార్డును బ్రేక్ చేయనున్నాడు.ఇక ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన మూడో బౌలర్‌గా అర్ష్‌దీప్ రికార్డులకు ఎక్కనున్నాడు.