ICC World Cup 2023 : బిర్యానీలు బాగున్నాయా..?
ఐసీసీ ప్రపంచ కప్ 2023లో ముగింపు దశకు వచ్చేసింది. గ్రూప్స్ దశలో ఒక్కో మ్యాచ్ మాత్రమే మిగిలివుంది. అయితే, సెమీ ఫైనల్స్ చేరకుండానే స్వదేశానికి తిరుగుముఖం పట్టబోతోండటం పట్ల పాకిస్తాన్‌పై విమర్శలు చెలరేగుతున్నాయి.

As the ICC World Cup 2023 draws to a close Hyderabadi biryanis seem to be a favorite among the defeated Pakistan cricketers
ఐసీసీ ప్రపంచ కప్ 2023లో (ICC World Cup 2023) ముగింపు దశకు వచ్చేసింది. గ్రూప్స్ దశలో ఒక్కో మ్యాచ్ మాత్రమే మిగిలివుంది. అయితే, సెమీ ఫైనల్స్ చేరకుండానే స్వదేశానికి తిరుగుముఖం పట్టబోతోండటం పట్ల పాకిస్తాన్‌పై విమర్శలు చెలరేగుతున్నాయి. పాకిస్తాన్‌కే చెందిన మాజీలు ఆ జట్టుపై నిప్పులు చెరుగుతున్నారు. వసీం అక్రమ్ వంటి లెజెండరీ ప్లేయర్ల జట్టు ఆడిన తీరును తప్పుపడుతున్నారు. ఎలాంటి వ్యూహాలు లేకుండా ఆడిందంటూ ధ్వజమెత్తుతున్నారు.
తాజాగా టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. వారితో జతకలిశాడు. ఘాటుగా స్పందించాడు. పాకిస్తాన్ వైఫల్యాలను ఎండగట్టాడు. తనదైన శైలిలో సెటైర్లు వేశాడు. ఆ జట్టుకు బైబై చెప్పాడు. కెప్టెన్ బాబర్ ఆజమ్ సహా టీమ్ మొత్తానికి గుడ్ బై చెప్పాడు. సేఫ్ ఫ్లైట్ జర్నీ టు పాకిస్తాన్ అంటూ కామెంట్స్ పోస్ట్ చేశాడు.అక్కడితో వదలలేదు. తమ దేశంలో పాకిస్తాన్ జట్టుకు అతిథి మర్యాదలు బాగా జరిగి ఉంటాయని, ఎలాంటి లోటూ వచ్చి ఉండదని వ్యాఖ్యానించాడు. బిర్యానీ టేస్ట్ వారికి నచ్చి ఉంటుందని సెటైర్ వేశారు. పాకిస్తాన్ ఏ జట్టును సపోర్ట్ చేస్తే ఆ జట్టు పాకిస్తాన్ లాగే ఆడుతుందనీ ఎద్దేవా చేశాడు. బైబై పాకిస్తాన్.. సేఫ్ ఫ్లైట్ జర్నీ అంటూ తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ పెట్టాడు వీరూ.