చెన్నై సూపర్ స్కెచ్ వేలంలో అశ్విన్,షమీలే టార్గెట్
ఐపీఎల్ మెగా వేలం కోసం ఫ్రాంచైజీలు కసరత్తు దాదాపు పూర్తయినట్టే కనిపిస్తోంది. రిటెన్షన్ జాబితాపై క్లారిటీ తెచ్చుకున్న కొన్ని ఫ్రాంచైజీలు వేలంలో కొనుగోలు చేసే ఆటగాళ్ళ పైనా ఫోకస్ పెట్టింది.
ఐపీఎల్ మెగా వేలం కోసం ఫ్రాంచైజీలు కసరత్తు దాదాపు పూర్తయినట్టే కనిపిస్తోంది. రిటెన్షన్ జాబితాపై క్లారిటీ తెచ్చుకున్న కొన్ని ఫ్రాంచైజీలు వేలంలో కొనుగోలు చేసే ఆటగాళ్ళ పైనా ఫోకస్ పెట్టింది. లీగ్ చరిత్రలో మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ గా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ పకడ్బందీగా ఆక్షన్ కు రెడీ అవుతోంది. ఆ జట్టు కొనుగోలు చేయాల్సిన ఆటగాళ్ల జాబితాను ఇప్పటికే సిద్దం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. చెన్నై ఫ్రాంచైజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌తో పాటు మహమ్మద్ షమీలపై కన్నేసినట్లు సమాచారం. 2015 వరకు చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన అశ్విన్‌ను మళ్లీ జట్టులోకి తీసుకోవాలని భావిస్తోంది. చెపాక్ స్టేడియంలో అశ్విన్ కు అద్భుతమైన రికార్డుంది. పైగా గత కొంతకాలంగా బ్యాట్ తోనూ అతను మెరుపులు మెరిపిస్తుండడంతో ఖచ్చితంగా వేలంలో దక్కించుకోవాలని సీఎస్కే పట్టుదలగా ఉంది.
ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ కు ఆడుతున్న అశ్విన్ ను ఆ జట్టు వేలంలోకి వదిలేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల తమిళనాడు ప్రీమియర్ లీగ్ లోనూ అశ్విన్ బంతితో పాటు బ్యాట్ తోనూ అదరగొట్టాడు. అందుకే ఎట్టపరిస్థుతుల్లోనూ యాష్ ను తీసుకోవాలని చెన్నై నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అలాగే మహమ్మద్ షమీ కోసం చెన్నై ప్రయత్నించబోతోంది. 2019లో అతని కోసం సీఎస్‌కే యత్నించగా.. పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం షమీ.. గుజరాత్ టైటాన్స్ కు ఆడుతున్నాడు. గత సీజన్ లో షమీ అద్భుతంగా రాణించాడు. వన్డే ప్రపంచకప్ లోనూ ఈ సీనియర్ పేసర్ లీడింగ్ వికెట్ టేకర్ గా నిలవడంతో షమీపైనా చెన్నై కన్నేసింది.