ASWIN : అశ్విన్ రికార్డుల వేట

రాజ్‌కోట్‌ వేదికగా ఇంగ్లండ్‌తో ప్రారంభం కానున్న మూడో టెస్టులో తలపడేందుకు టీమిండియా సన్నద్దమవుతోంది. ఈ మ్యాచ్ కు ముందు భారత వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 14, 2024 | 12:29 PMLast Updated on: Feb 14, 2024 | 12:29 PM

Ashwins Record Chase

రాజ్‌కోట్‌ వేదికగా ఇంగ్లండ్‌తో ప్రారంభం కానున్న మూడో టెస్టులో తలపడేందుకు టీమిండియా సన్నద్దమవుతోంది. ఈ మ్యాచ్ కు ముందు భారత వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. రాజ్‌కోట్‌ టెస్టులో అశ్విన్‌ మరో 4 వికెట్లు పడగొడితే.. స్వదేశంలో టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా రికార్డులకెక్కుతాడు. అశ్విన్‌ ఇప్పటివరకు భారత్‌లో 346 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో 350 వికెట్లతో భారత స్పిన్‌ దిగ్గజం అనిల్‌ కుంబ్లే అగ్రస్ధానంలో ఉన్నాడు.అదేవిధంగా అశ్విన్‌ మరో ఒక్క వికెట్‌ సాధిస్తే.. టెస్టుల్లో 500 వికెట్ల మైలురాయిని అందుకుంటాడు. ఈ ఘనత సాధించిన తొమ్మిదో క్రికెటర్‌గా, రెండో భారత బౌలర్‌గా అశ్విన్‌ నిలుస్తాడు.