అందం తెచ్చిన తంటా

athlets complaints on luana alonso beauty
అందంగా ఉండడమే ఆమెకు శాపంగా మారింది.
పరాగ్వేకి చెందిన లువానా అలాన్సో అనే 20 ఏళ్ల స్విమ్మర్ పారీస్ ఒలింపిక్స్‌లో తన దేశం తరపున పాల్గొనడానికి వచ్చింది. సెమీస్ వరకే పరిమితమయింది. తర్వాత గేమ్స్ ముగిసే వరకు తోటి పరాగ్వే అథ్లెట్లతో కలిసి ఉంటోంది. అయితే అలాన్సో అందం కారణంగా తాము పోటీలపై దృష్టి పెట్టలేకపోతున్నామని తోటి పరాగ్వే మేల్ అథ్లెట్లు కంప్లైంట్ చేశారు. తన అందంతో ఆమె చాలా డిస్ట్రబ్ చేస్తోందని.. అంతే కాకుండా తమ ఏకాగ్రత దెబ్బతినేలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. వెంటనే అధికారులు ఆమెను దేశానికి తిరిగి వచ్చేయాలని హుకుం జారీ చేశారు. వాస్తవానికి ఓడిపోయిన ఆటగాళ్లు ఒలింపిక్స్ ముగిసే వరకు విలేజ్‌లో ఉండొచ్చు. కానీ స్వయంగా పరాగ్వే టీమ్ ఆటగాళ్లే కంప్లైట్ చేయడంతో ఆమెను బయటకు పంపించక తప్పలేదు