Uppal Stadium: ఉప్పల్‌లో పాక్ మ్యాచ్.. ప్రేక్షకులకు నో ఎంట్రీ.. కారణం ఇదే..!

ఈ నెల 28న గణేష్ నిమజ్జనం, మిలాద్-ఉన్-నబీ పండగ ఉండటంతో పోలీసులు వాటికే భద్రత కల్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌‌‌‌కు భద్రత కల్పించలేమని సిటీ పోలీసులు హెచ్‌‌‌‌సీఏకు స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని హెచ్‌‌‌‌సీఏ.. బీసీసీఐకి తెలిపింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 20, 2023 | 04:28 PMLast Updated on: Sep 20, 2023 | 4:28 PM

Audience Are Not Allowed To Uppal Stadium For Nz Vs Pak Warm Up Match

Uppal Stadium: వన్డే వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌లో హైదరాబాద్‌‌‌‌లో ఇండియా మ్యాచ్‌‌‌‌లు లేకపోవడంతో నిరుత్సాహంగా ఉన్న భాగ్యనగర క్రికెట్‌‌‌‌ అభిమానులకు మరో చేదు వార్త. ఉప్పల్‌‌‌‌లో ఈ నెల 29న పాకిస్తాన్-న్యూజిలాండ్ మధ్య వార్మప్ మ్యాచ్‌‌‌‌ జరగనున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్ ఖాళీ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌‌‌‌కు ప్రేక్షకులను అనుమతించడం లేదు. ఈ నెల 28న గణేష్ నిమజ్జనం, మిలాద్-ఉన్-నబీ పండగ ఉండటంతో పోలీసులు వాటికే భద్రత కల్పించాల్సి ఉంది.

ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌‌‌‌కు భద్రత కల్పించలేమని సిటీ పోలీసులు హెచ్‌‌‌‌సీఏకు స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని హెచ్‌‌‌‌సీఏ.. బీసీసీఐకి తెలిపింది. ‘ఒకే రోజు రెండు పండగలు రావడంతో భద్రత విషయంలో ఇబ్బంది ఉంటుందని పోలీసులు తెలిపారు. దాంతో ఈ మ్యాచ్‌‌‌‌ను ఖాళీ స్టేడియంలో నిర్వహించాలని బీసీసీఐ సెక్రటరీ జై షా, వైస్​ ప్రెసిడెంట్​ రాజీవ్‌‌‌‌ శుక్లాకు చెబితే సూత్రప్రాయంగా అంగీకరించారు. సోమవారం బీసీసీఐకి లెటర్‌‌‌‌ కూడా రాశాం అని, హెచ్‌‌‌‌సీఏ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న దుర్గాప్రసాద్‌‌‌‌ తెలిపారు. ఈ మ్యాచ్‌కు టిక్కెట్లు బుక్‌ చేసుకొన్న వారికి సొమ్మును రిఫండ్‌ చేయాలని కూడా బుక్‌మై షోను బీసీసీఐ ఆదేశించింది. అక్టోబర్ 3న ఆస్ట్రేలియా-పాక్‌‌‌‌ వార్మప్‌‌‌‌తో పాటు మూడు వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లు ఫ్యాన్స్‌‌‌‌ మధ్యన షెడ్యూల్‌‌‌‌ ప్రకారమే జరుగుతాయని స్పష్టం చేశారు.

అయితే, అంతకుముందు.. అంటే పోలీసుల అభ్యంతరం మేరకు ఈ వామప్‌ మ్యాచ్‌ను రీషెడ్యూల్‌ చేయాలని హెచ్‌సీఏ ఎప్పుడో బీసీసీఐని విజ్ఞప్తి చేసింది. కానీ, అందుకు బీసీసీఐ అంగీకరించలేదు. ఇక వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు మరో మ్యాచ్ కూడా హైదరాబాద్‌లో జరుగుతుంది. అక్టోబర్ 6వ పాకిస్తాన్ నెదర్లాండ్స్‌తో తలపడుతుంది. ఉప్పల్ స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యాన్ని ఇవ్వనుంది.