ఆసీస్ హిట్టర్ కు ప్రమోషన్, లంక టూర్ కు కెప్టెన్ గా హెడ్ ?
భారత్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో సత్తాచాటుతున్న ఆసీస్ స్టార్ ప్లేయర్ ట్రావిస్ హెడ్‌కు ప్రమోషన్ దక్కనుంది. శ్రీలంక టూర్‌కు ఒకవేళ కమ్మిన్స్ దూరమైతే, కెప్టెన్సీ బాధ్యతలు హెడ్‌కు అప్పగించాలని క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తున్నట్లు సమాచారం.
భారత్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో సత్తాచాటుతున్న ఆసీస్ స్టార్ ప్లేయర్ ట్రావిస్ హెడ్‌కు ప్రమోషన్ దక్కనుంది. శ్రీలంక టూర్‌కు ఒకవేళ కమ్మిన్స్ దూరమైతే, కెప్టెన్సీ బాధ్యతలు హెడ్‌కు అప్పగించాలని క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తున్నట్లు సమాచారం. వైస్ కెప్టెన్ గా స్మిత్ ఉన్నప్పటికి హెడ్ వైపే క్రికెట్ ఆస్ట్రేలియా పెద్దలు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది.
హెడ్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా టెస్టుల్లో కెప్టెన్సీ చేయలేదు. కానీ వైట్ బాల్ క్రికెట్‌లో మాత్రం సారథిగా హెడ్‌కు అనుభవం ఉంది.
బిగ్ బాష్ లీగ్‌లో అడిలైడ్ స్ట్రైకర్స్ ను హెడ్ లీడ్ చేశాడు. కాగా బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో హెడ్ ఇప్పటికే రెండు సెంచరీలు సాధించాడు. పింక్‌బాల్ టెస్టులో ఆసీస్ ఘన విజయం సాధించడంలో హెడ్ కీలక పాత్ర పోషించాడు. ఫార్మాట్ తో సంబంధం లేకుండా విధ్వంసకర బ్యాటింగ్ తో అదరగొడుతున్నాడు.