రోహిత్ కు ఎవరు సాటిరారు ఆసీస్ పేసర్ ప్రశంసలు

భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మపై ఆస్ట్రేలియా పేసర్ హెజిల్ వుడ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొనే విషయంలో రోహిత్ అత్యుత్తమమని కితాబిచ్చాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 26, 2024 | 07:20 PMLast Updated on: Sep 26, 2024 | 7:20 PM

Australia Fast Bowler About Rohith Sharma

భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మపై ఆస్ట్రేలియా పేసర్ హెజిల్ వుడ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొనే విషయంలో రోహిత్ అత్యుత్తమమని కితాబిచ్చాడు. ముఖ్యంగా బౌన్సర్లను ఎదుర్కొనే విషయంలో రోహిత్ శర్మకు ఎవరూ సాటిలేరు అని ఈ ఆసీస్ పేసర్ ప్రశంసించాడు. ఆ బాల్స్ రోహిత్ ను ఏమాత్రం ఇబ్బంది పెట్టబోవన్నాడు. వేగంగా వచ్చే బంతుల్ని సునాయాసంగా ఎదుర్కుంటాడని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రోహిత్‌కు బౌలింగ్ చేయడం చాలా కష్టమని హ్యాజిల్ వుడ్ అభిప్రాయపడ్డాడు. టీ ట్వంటీ వరల్డ్ కప్ తో షార్ట్ ఫార్మాట్ కు గుడ్ బై చెప్పిన రోహిత్ శర్మ ప్రస్తుతం టెస్టులు, వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు.