Glenn Maxwell smoking : అనుభవించు రాజా
వరల్డ్ కప్ లో భాగంగా దక్షిణాఫ్రికాతో నిన్న జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. కనీసం పోరాటం కూడా ఇవ్వకుండా 134 పరుగుల భారీ తేడాతో వరల్డ్ కప్ లో వరుసగా రెండో పరాజయాన్ని మూటకట్టుకుంది. 5 సార్లు ప్రపంచ ఛాంపియన్ లకు ఇలాంటి దుస్థితి రావడం ఏంటి అని అందరూ ఆశ్చర్యపోయారు.

Australia lost badly in the World Cup Glenn Maxwell smoking a cigarette
వరల్డ్ కప్ లో భాగంగా దక్షిణాఫ్రికాతో నిన్న జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. కనీసం పోరాటం కూడా ఇవ్వకుండా 134 పరుగుల భారీ తేడాతో వరల్డ్ కప్ లో వరుసగా రెండో పరాజయాన్ని మూటకట్టుకుంది. 5 సార్లు ప్రపంచ ఛాంపియన్ లకు ఇలాంటి దుస్థితి రావడం ఏంటి అని అందరూ ఆశ్చర్యపోయారు. ఈ విషయాన్ని పక్కన పెడితే ఆసీస్ ఓటమి దాదాపు ఖరారైన తరుణంలో గ్లెన్ మ్యాక్స్ వెల్ సిగరెట్ తాగుతూ కెమెరా చేతికి చిక్కాడు. 312 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియా 70 పరుగులకే ఆరు వికెట్లను కోల్పోయింది.
జట్టు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మ్యాక్స్ వెల్ డ్రెస్సింగ్ రూమ్ బయట సిగరెట్ తాగుతూ కనిపించాడు. గ్రౌండ్ లో కెమెరాలు ఆసీస్ డ్రెస్సింగ్ రూమ్ వైపు తిప్పడంతో మ్యాక్స్వెల్ చేసిన ఈ పని బయటపడింది. ప్రస్తుతం మ్యాక్సీ చేసిన పని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సాధారణంగా క్రికెట్ లో ఆటగాళ్లకు చాలా కఠిన రూల్స్ ఉంటాయి. ఎంత స్టార్ ఆటగాడైన తప్పు చేసి దొరికితే శిక్షకు విధించాల్సిందే. మ్యాచ్ ఫిక్సింగ్, స్పాట్ ఫిక్సింగ్ లాంటి విషయాల్లో లైఫ్ టైం బ్యాన్ పడే అవకాశముంది. అయితే మ్యాక్స్ వెల్ చేసిన ఈ తప్పును ఐసీసీ పట్టించుకుంటుందో లేదో చూడాలి. కాగా .. ఈ మ్యాచులో 17 బంతులు ఎదుర్కొన్న మ్యాక్స్ వెల్ కేవలం 3 పరుగులు మాత్రమే చేసి మహారాజ్ బౌలింగ్ లో ఔటయ్యాడు.