Glenn Maxwell: ఇండియన్ స్టైల్ లో పేరంటం.. భార్య విలువలకు ప్రేమతో గౌరవం
చాలా ప్రయత్నాల తర్వాత ఆసీస్ స్టార్ గ్లెన్ మ్యాక్స్ వెల్ దంపతులకు సంతానం కలుగుతోంది. ఈ ఏడాది మే నెలలో ఈ విషయాన్ని గ్లెన్ భార్య విని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

Australian cricket player Glenn Maxwell married his wife Vinni Seemanth in the Tamil tradition
పలుమార్లు గర్భస్రావం జరిగిన తర్వాత తమకు సంతానం కలుగుతోందని ప్రకటించింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆమెకు సీమంతం జరిగింది. విని ఆస్ట్రేలియాలో ఉంటున్నప్పటికీ తమ తమిళ మూలాలను మర్చిపోలేదు. అందుకే గ్లెన్ తో వివాహం కూడా రెండు సాంప్రదాయాల ప్రకారం చేసుకుంది. ముందుగా తమిళ సంప్రదాయంలో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అనంతరం క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలోనే తమిళ సంప్రదాయం ప్రకారం వినికి సీమంతం చేయించాడు గ్లెన్. దీనికి సంబంధించిన ఫోటోలను విని తన సోషల్ మీడియాలో పంచుకుంది.
గతేడాది మార్చి నెలలో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. తమ వ్యక్తిగత జీవితాల గురించి వీళ్లిద్దరూ ఎక్కువగా బయటకు చెప్పరు. అయితే ఈ ఏడాది మే నెలలో తను గర్భవతిని అని, పలుమార్లు గర్భస్రావం జరిగిన తర్వాత ఇప్పుడు ఆరోగ్యమైన శిశువుకు జన్మనివ్వబితున్నట్లు ఆమె వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమెకు వలైపాక్కు కార్యక్రమం నిర్వహించారు. ఇది ఒక విధంగా తమిళ సీమంతం అన్నమాట. ఈ కార్యక్రమంలో గర్భవతిని ఆమె బంధువులు కలిసి ఆశీర్వదిస్తారు. త్వరలో వీనికి డెలివరీ జరిగితే.. గ్లెన్ కూడా డాడీ క్రికెటర్ల క్లబ్బులో కలుస్తాడు. ఈ వేడుకలో గ్లెన్ మ్యాక్స్ వెల్ కూడా ఉత్సాహంగా పాల్గొన్నాడు. సోషల్ మీడియాలో ఫ్యాన్స్, సహచర ఆటగాళ్ళు ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.