World Cup: వరల్డ్ కప్ జట్టు ప్రకటన స్టార్ ఆటగాడికి మొండిచేయి

ఈ ఏడాది భారత్‌ ఆతిథ్యమివ్వనున్న వన్డే ప్రపంచకప్‌ 2023 అక్టోబర్‌ 5న ఆరంభం కానున్న సంగతి తెలిసిందే.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 7, 2023 | 05:52 PMLast Updated on: Aug 07, 2023 | 5:52 PM

Australian Fast Bowler And Captain Pat Cummins Has Been Ruled Out Of The Odi World Cup Final Squad Due To Injury

ఈ మెగా టోర్నీ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా 18 మంది ఆటగాళ్లతో కూడిన ప్రాథమిక జట్టును ప్రకటించింది. ఈ జట్టులో ఆసీస్ స్టార్ బ్యాటర్ మార్నస్ లబుషేన్‌కు చోటు దక్కలేదు.డెబ్యూ ఆటగాడు, లెగ్ స్పిన్నర్ తన్వీర్ సంఘా, అనుభవం లేని ఆల్‌రౌండర్‌ ఆరోన్ హార్డీకి వన్డే ప్రపంచకప్‌ 2023 ఆస్ట్రేలియా ప్రాథమిక జట్టులో చోటు దక్కింది. ఐసీసీ నిబంధనల ప్రకారం.. సెప్టెంబరు 28కి ముందు అన్ని టీమ్స్ తమ జట్లను ప్రకటించాలి. ఇప్పుడు ఆసీస్ 18 మందితో కూడిన జట్టును ప్రకటించినా.. టోర్నీ ఆరంభానికి ముందు 15 మంది ఆటగాళ్లతో జట్టును ప్రకటిస్తుంది.

ఈ ఏడాది ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా తన మొదటి మ్యాచ్ అక్టోబరు 8న చెన్నైలో ఆతిథ్య భారత్‌తో ఆడుతుంది. ఇంగ్లండ్‌తో ఇటీవల జరిగిన యాషెస్ 2023లో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్, కెప్టెన్ పాట్ కమ్మిన్స్‌ గాయపడ్డాడు. అతడు మణికట్టు గాయంతో బాధపడుతున్నాడు. కమ్మిన్స్‌కు ఆరు వారాల విశ్రాంతి అవసరం అని వైద్యబృందం సలహా ఇచ్చింది. దాంతో కమ్మిన్స్‌ ప్రపంచకప్ ప్రారంభానికి ముందే తిరిగి జట్టులోకి రానున్నాడు. చివరిసారి జరిగిన 2019 ప్రపంచకప్ టైటిల్‌ను ఇంగ్లండ్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆరో ప్రపంచకప్ టైటిల్‌ను కైవసం చేసుకునేందుకు ఆసీస్ బరిలోకి దిగుతోంది.