IPL 2024 : కెప్టెన్సీ కుస్తీ..
ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్, కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ఐపీఎల్ 2024 మినీ వేలంలో రికార్డ్ ధరకు అమ్ముడయ్యాడు. 2 కోట్ల కనీస ధరతో ఈ ఆసీస్ కెప్టెన్ వేలం ప్రారంభం కాగా.. సన్ రైజర్స్ హైదరాబాద్ 20.50 కోట్లు వెచ్చించి అతన్ని దక్కించుకుంది. కమిన్స్ ను ఎలాగైనా దక్కించుకోవాలనుకున్న హైదరాబాద్ సన్ రైజర్స్.. బెంగళూరు పై పోటా పోటీగా వేలం పాల్గొన్నది. కమ్మిన్స్ కోసం అసలు వెనక్కి తగ్గని సన్ రైజర్స్, ఆక్షన్ లో భారీ ధరకు సొంతం చేసుకుంది.

Australian fast bowler, captain Pat Cummins was sold for a record price in the IPL 2024 mini auction.
ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్, కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ఐపీఎల్ 2024 మినీ వేలంలో రికార్డ్ ధరకు అమ్ముడయ్యాడు. 2 కోట్ల కనీస ధరతో ఈ ఆసీస్ కెప్టెన్ వేలం ప్రారంభం కాగా.. సన్ రైజర్స్ హైదరాబాద్ 20.50 కోట్లు వెచ్చించి అతన్ని దక్కించుకుంది. కమిన్స్ ను ఎలాగైనా దక్కించుకోవాలనుకున్న హైదరాబాద్ సన్ రైజర్స్.. బెంగళూరు పై పోటా పోటీగా వేలం పాల్గొన్నది. కమ్మిన్స్ కోసం అసలు వెనక్కి తగ్గని సన్ రైజర్స్, ఆక్షన్ లో భారీ ధరకు సొంతం చేసుకుంది. స్టార్ ప్లేయర్ అయినప్పటికీ.. ఒక ఫాస్ట్ బౌలర్ కోసం 20 కోట్లకు పైగా వెచ్చించడం అనవసరమనే అనే అనుమానాలు ప్రతి ఒక్కరిలో ఉన్నాయి. అయితే కమ్మిన్స్ ను SRH యాజమాన్యం అంత పిచ్చిగా ఏమీ కొనలేదని అర్ధమవుతుంది. గత సీజన్ లో హైదరాబాద్ జట్టు చెత్త ప్రదర్శనతో నిరాశ పరిచిన సంగతి తెలిసిందే. 14 మ్యాచ్ ల్లో కేవలం 4 మ్యాచుల్లో గెలిచి 10 ఓడిపోయింది. ఈ ఓటమికి కెప్టెన్ మార్కరం అనుభవం లేని తనం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కారణంగానే కమ్మిన్స్ ను కెప్టెన్ గా తీసుకున్నట్లుగా తెలుస్తుంది. కమ్మిన్స్ అంతర్జాతీయ క్రికెట్ లో విజయవంతమైన కెప్టెన్ గా పేరుంది. 2023 లో ఆస్ట్రేలియాకు టెస్ట్ ఛాంపియన్ షిప్ తో పాటు, భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ ను ఆసీస్ కు అందించాడు. పదునైన పేస్ బౌలింగ్ వేయడంతో పాటు లోయర్ ఆర్డర్ లో హిట్టింగ్ చేయగల సామర్ధ్యం ఉంది. కమ్మిన్స్ సన్ రైజర్స్ కెప్టెన్ అయితే ఇక తిరుగుండదు. కెప్టెన్ కోసమే కమ్మిన్స్ కు భారీ ధర వెచ్చించారని స్పష్టంగా అర్ధం అవుతుంది. ఇదే జరిగితే ప్రస్తుత కెప్టెన్ మార్కరంకు నిరాశ ఖాయంగా కనిపిస్తుంది.