Australian women’s cricket : 7 వరల్డ్ కప్స్ గెలిచింది.. ఇప్పుడు రిటైర్మెంట్
ఆస్ట్రేలియా (Australia) మహిళా క్రికెట్ (Women's Cricket) టీమ్ కెప్టెన్ మెగ్ లాన్నింగ్ ( Meg Lanning) సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Australian women's cricket team captain Meg Lanning's sensational decision
ఆస్ట్రేలియా (Australia) మహిళా క్రికెట్ (Women’s Cricket) టీమ్ కెప్టెన్ మెగ్ లాన్నింగ్ ( Meg Lanning) సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. తన తీసుకున్న నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని లాన్నింగ్ వెల్లడించింది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవడానికి ఇదే సరైన టైం అని ఆమె పేర్కొంది. 31 ఏళ్ల లాన్నింగ్ సడెన్ గా తీసుకున్న ఈ నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ఇక, మెగ్ లాన్నింగ్ తన 13 ఏళ్ల సుధీర్ఘ కెరీర్‌లో 241 అంతర్జాతీయ మ్యాచ్ ( International Match) ల్లో ఆస్ట్రేలియా జట్టుకు ప్రాతినిథ్యం వహించింది. 182 మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా ఆమె వ్యవహరించారు. ఫుల్‌టైమ్ బ్యాటర్, పార్ట్ టైమ్ బౌలర్ అయిన మెగ్ లాన్నింగ్ తన కెరీర్‌లో 17 సెంచరీలతో పాటు 38 అర్థ శతకాలు చేయడంతో పాటు 5 వికెట్లు పడగొట్టింది. మూడు రకాల ఫార్మెట్లలో 241 మ్యాచ్ లు ఆడి 8,352 పరుగులు సాధించారు. లాన్నింగ్ తన కెరీర్‌లో ఏడు వరల్డ్‌కప్ టైటిళ్లు సాధించడంలో కీలక పాత్ర పోషించింది. అయితే, అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ తీసుకోవడం చాలా కష్టమైన నిర్ణయం అని మెగ్ లాన్నింగ్ పేర్కొన్నారు. కానీ, రిటైర్మెంట్ కోసం ఇదే సరైన సమయమని ఆమె తెలిపారు. ఇక, మెగ్ లాన్నింగ్ మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో మెల్‌బోర్న్ స్టార్స్‌కు సారథిగా కొనసాగుతానని ప్రకటించింది.