ఛారిటీకి కోహ్లీ ఆటోగ్రాఫ్ బ్యాట్, ఆసీస్ స్పిన్నర్ గొప్ప మనసు
ఆస్ట్రేలియా ఆఫ్‌స్పిన్నర్ నాథన్ లియాన్ గొప్ప మనసు చాటుకున్నాడు. వికలాంగ క్రికెటర్ల సంక్షేమం కోసం తాను జ్ఞాపకాలుగా సేకరించుకున్న బ్యాట్లన్నీ విరాళంగా ఇచ్చాడు.
ఆస్ట్రేలియా ఆఫ్‌స్పిన్నర్ నాథన్ లియాన్ గొప్ప మనసు చాటుకున్నాడు. వికలాంగ క్రికెటర్ల సంక్షేమం కోసం తాను జ్ఞాపకాలుగా సేకరించుకున్న బ్యాట్లన్నీ విరాళంగా ఇచ్చాడు. భారత స్టార్లు విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ సహా ఆసీస్ క్రికెటర్లు పాట్ కమ్మిన్స్, స్టీవ్ స్మిత్‌లు సంతకం చేసిన బ్యాట్లను లియోన్.. నేషనల్ క్రికెట్ ఇన్‌క్లూజన్ ఛాంపియన్‌షిప్ కి విరాళంగా ఇచ్చాడు.
ఈ 37 ఏళ్ల స్పిన్నర్ విరాళంగా ఇచ్చిన బ్యాట్లపై బ్రెయిలీ లిపిలో స్పోర్ట్ ఫర్ ఆల్ అని సందేశం ఉంది.
లియాన్ విరాళంగా ఇచ్చిన బ్యాట్లను వేలం వేయనున్నారు. తద్వారా వచ్చిన డబ్బును అంగ వైకల్యం ఉన్న క్రికెటర్ల సంక్షేమం కోసం ఉపయోగించనున్నారు.