ఆటో డ్రైవర్ కొడుకు అదుర్స్ చెన్నైనే వణింకించాడుగా

ఐపీఎల్ అంటేనే మన దేశవాళీ క్రికెట్ టాలెంట్ కు కేరాఫ్ అడ్రస్... దేశంలో ఎక్కడి నుంచైనా వెలుగులోకి వచ్చి ఈ వేదికగా దుమ్మురేపుతున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 24, 2025 | 06:30 PMLast Updated on: Mar 24, 2025 | 6:30 PM

Auto Drivers Son Adhurs Has Shaken Chennai

ఐపీఎల్ అంటేనే మన దేశవాళీ క్రికెట్ టాలెంట్ కు కేరాఫ్ అడ్రస్… దేశంలో ఎక్కడి నుంచైనా వెలుగులోకి వచ్చి ఈ వేదికగా దుమ్మురేపుతున్నారు. ఒకప్పుడు టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వాలంటే రంజీ క్రికెట్ లో నిలకడగా రాణిస్తే తప్ప కనీసం ప్రాబబుల్స్ లో కూడా చోటు దక్కేది కాదు… కానీ ఇప్పుడు ఐపీఎల్ తో నేరుగా జాతీయ జట్టులోకి అడుగుపెడుతున్నారు.. ప్రతీ సీజన్ లో కొందరు యువ ఆటగాళ్ళు ఐపీఎల్ ల్లో తమ ప్రతిభను చాటుకుంటున్నారు. తాజాగా ముంబై, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ లో అలాంటి ఓ యంగ్ టాలెంట్ ను అందరూ చూశారు. ఈ మ్యాచులో ముంబయి ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. వాస్తవానికి లక్ష్యం మరీ పెద్దది కాకపోయినప్పటికీ ఆరంభంలో చెన్నై కాస్త తడబడుతూనే ఆడింది. అయితే పలువురు స్టార్ ప్లేయర్స్ ఉన్నప్పటకీ క్రికెట్ అభిమానుల దృష్టి ఓ అరంగేట్ర ఆటగాడిపై పడింది. ఐపీఎల్ అరంగేట్రంలోనే అతడు మంచి ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు.

ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన చెన్నై బ్యాటర్లు 15 ఓవర్లకే మ్యాచ్‌ని ముగుస్తారని అందరూ అనుకున్నారు. కెప్టెన్ గైక్వాడ్ సిక్సర్లు, ఫోర్లతో క్లాస్ టచ్ చూపిస్తున్నాడు. మరోవైపు రచిన్ రవీంద్ర నిలకడగా ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో ముంబై కెప్టెన్ సూర్య ఓ స్పిన్ అస్త్రాన్ని ఉపయోగించాడు. కెప్టెన్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఐపీఎల్‌లో తాను వేసిన మొదటి ఓవర్‌లోనే వికెట్ తీసుకున్నాడు. రుతురాజ్ గైక్వాడ్ భారీ షాట్‌కు ప్రయత్నించి బౌండరీ వద్ద దొరికిపోయాడు. ఆ తర్వాతి ఓవర్‌లో శివమ్ దుబే, ఆ పై ఓవర్‌లో దీపక్ హుడాని పెవలియన్‌కి పంపాడు. ఆ స్పిన్ అస్త్రం వరల్డ్ ఫేమస్ శాన్‌ట్నర్ కాదు చిన్న కుర్రాడు విఘ్నేశ్ పుతుర్.

ఈ లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్నర్.. అద్భుతంగా బౌలింగ్ చేస్తూ మరో కీలక వికెట్ శివమ్ దూబెను కూడా ఔట్ చేశాడు. అనంతరం దీపిక్ హూడాను కూడా పెవిలియన్ పంపాడు. మొత్తంగా నాలుగు ఓవర్లలో 32 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీసాడు . దీంతో సీఎస్కే స్టార్ బ్యాటర్ ధోనీ కూడా.. అతడిని ప్రశంసించకుండా ఉండలేకపోయాడు. మ్యాచ్ అనంతరం అతడి భుజంపై చేయి మరి అభినందించాడు. దిగ్గజ క్రికెటర్ అతడిని అభినందించడం, పైగా మ్యాచులో కీలక వికెట్లు తీయడంతో.. విఘ్నేశ్‌ పుత్తూర్ గురించి క్రికెట్ అభిమానులు తెగ ఆరాతీస్తున్నారు. అతడు ఎవరో తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

24 ఏళ్ల విఘ్నేశ్ పుత్తూర్ ది కేరళలోని మలప్పురమ్. విఘ్నేశ్ పుత్తూర్.. ఓ ఆటోరిక్షా డ్రైవర్ కొడుకు. మొదట అతడు మీడియమ్ పేస్ బౌలింగ్ చేసేవాడు. కానీ ఆ తర్వాత లోకల్ క్రికెటర్ మహ్మద్ షరీఫ్ సలహాతో లెగ్ స్పిన్ వేయడం మొదలుపెట్టాడు. అది అతడి కెరీర్ ను మలుపు తిప్పింది. అనంతరం కేరళ కాలేజీ ప్రీమియర్ టీ20లీగ్ లో స్టార్ ను చేసింది.గత సీజన్ లో సౌతాఫ్రికీ టీ20లీగ్ లో ముంబయి తరఫున నెట్ బౌలర్ గా సేవలందించాడు.ఈ యంగ్‌స్టర్‌ను ముంబై మెగావేలంలో 30 లక్షలకు దక్కించుకుంది.కేరళ తరఫున సీనియర్ లెవల్ లో ఆడకపోయినా అండర్ 14, అండర్ 19 స్థాయిలో ఆడాడు. ప్రస్తుతం కేరళ క్రికెట్ లీగ్ లో అలెప్పి రిపిల్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అందులో రెండు మూడు మ్యాచులు ఆడి రెండు వికెట్లు తీశాడు. ఇతడు తమిళనాడు ప్రీమియర్ లీగ్ లోనూ ఆడాడు. నెట్స్‌లో అదరగొట్టడంతో ఐపీఎల్ 2025 మొదటి మ్యాచ్‌లో రోహిత్ శర్మ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా అవకాశం ఇచ్చింది. మొదటి మ్యాచ్‌తోనే తనపేరు ఐపీఎల్‌కు వినిపించేట్టు మంచి ప్రదర్శనతో అదరగొట్టాడు.