Babar Azam: ముందే గుండు కొట్టించుకున్నావ్ ఇంతకు ఇండియా వస్తారా లేదా
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ న్యూ లుక్ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. మైదానంలో తన ఆటతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న బాబర్ ఆజామ్.. ఒక్కసారిగా బోడి గుండుతో దర్శనమిచ్చి అందరికీ షాకిచ్చాడు.

Pakistan Babar Azam Gundu Boss new look expressions are attracting everyone and are making funny comments on social media
ప్రస్తుతం బాబర్ ఆజామ్ బోడి గుండు ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. క్యాప్ తీసి గుండు బాస్ అంటూ బాబార్ ఆజామ్ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. బోడి గుండుతో కారులో దిగిన ఓ ఫొటో మీమర్స్‌కు మంచి కంటెంట్‌గా మారింది. బాబర్ బోడి గుండుతో మీమర్స్ ఫన్నీ పోస్ట్‌లతో నవ్వులు పూయిస్తున్నారు. అభిమానులు కూడా బాబర్ ఆజామ్ న్యూ లుక్‌పై సరదా కామెంట్స్ చేస్తున్నారు. భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్ ఓడిపోతే.. ‘మీ అభిమానులు నీకు బోడి గుండు కొట్టిస్తారని ముందే చేసుకున్నావా?’ అని సెటైర్లు పేల్చుతున్నారు.
కొందరైతే ఈ లుక్ నీకు బాగా సూటైందని ఎటకారం చేస్తుంటే.. మరికొందరు పుష్పలోని భన్వార్ సింగ్ షేఖావత్ పాత్రను చూసి బాబర్ ఆజామ్ బోడి గుండు కొట్టుకున్నట్లున్నాడని ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. హెయిర్ ఫాల్‌ను కవర్ చేసేందుకే బాబర్ ఆజామ్ గుండు కొట్టించాడని మరికొందరు ఆరోపిస్తున్నారు. అసలు ఇది రియల్ ఫోటోనేనా? అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.