బాబరూ ఇది టెస్ట్ కాదయ్యా పాక్ బ్యాటర్ పై ట్రోల్స్
ఛాంపియన్స్ ట్రోఫీని ఆతిథ్య పాకిస్తాన్ ఓటమితో ప్రారంభించింది. డెత్ ఓవర్స్ లో చెత్త బౌలింగ్, పేలవ బ్యాటింగ్ పాక్ కొంపముంచాయి. ఆ జట్టు స్టార్ బ్యాటర్లు ఎవ్వరూ కూడా స్థాయికి తగినట్టు ఆడలేకపోయారు

ఛాంపియన్స్ ట్రోఫీని ఆతిథ్య పాకిస్తాన్ ఓటమితో ప్రారంభించింది. డెత్ ఓవర్స్ లో చెత్త బౌలింగ్, పేలవ బ్యాటింగ్ పాక్ కొంపముంచాయి. ఆ జట్టు స్టార్ బ్యాటర్లు ఎవ్వరూ కూడా స్థాయికి తగినట్టు ఆడలేకపోయారు. ముఖ్యంగా భారీ అంచనాలు పెట్టుకున్న బాబర్ అజాం హాఫ్ సెంచరీ చేసినా ఎటువంటి యూజ్ లేకపోయింది. టెస్ట్ ఫార్మాట్ లో ఆడినట్టు అత్యంత నిదానంగా ఆడిన బాబర్ పై పాక్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో మండిపడుతున్నారు. తన జిడ్డు బ్యాటింగ్ తో బాబర్ ఆజామ్ మరోసారి సోషల్ మీడియాలో ట్రోల్స్ కు గురయ్యాడు. న్యూజిలాండ్ తో జరిగిన ఓపెనింగ్ గేమ్ లో అతడు ఆడిన తీరుపై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి.బాబర్ ఆజామ్‌పై భారీ ఆశలు పెట్టుకోగా అతడు 64 పరుగులు చేసి ఔట్ అవ్వడం ప్రేక్షకులకు తీవ్ర నిరాశకు గురి చేసింది.
వాస్తవానికి సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్, ఫకర్ జమ్మాన్ అంతా పెవిలియన్ చేరడంలో బాబర్ ఆజామ్ దూకుడుగా ఆడతాడని అంతా ఆశించారు. కానీ బాబార్ మాత్రం తన స్లో ఇన్నింగ్స్ తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. టాప్ ఆర్డర్ లో అతడు హాఫ్ సెంచరీ చేసినప్పటికీ చాలా స్లోగా జిడ్డు బ్యాటింగ్ చేశాడు. 90 బంతుల్లో 6 ఫోర్లు ఓ సిక్స్ సాయంతో 64 రన్స్ చేశాడు. క్రీజులో నిలదొక్కుక్కున్న తర్వాత కూడా అతడు దూకుడుగా ఆడే ప్రయత్నం చేయకుండా డిఫెన్స్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ సాధించడానికి అతడికి 81 బంతులు పట్టింది. దీంతో అతడి జిడ్డు బ్యాటింగ్‌తో పాకిస్థాన్ విజయవకాశాలు దెబ్బతన దెబ్బతిన్నాయని క్రికెట్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. పేలవ ఫామ్‌తో ఇబ్బంది అడుతున్న అతడు.. అర్ధ శతకం నమోదు చేయాలనే లక్ష్యంతోనే ఈ జిడ్డు బ్యాటింగ్ చేశాడని అభిప్రాయపడుతున్నారు.
బాబర్ ఆజామ్ – వైస్ కెప్టెన్ సల్మాన్ అలీతో కలిసి 58 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. అయితే సల్మాన్ దూకుడుగా ఆడినప్పటికీ బాబార్ మాత్రం చాలా నెమ్మెదిగా ఆడాడు. దీనిపై మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ మాట్లాడుతూ.. తాబేలు – కుందేలు కథతో వీరిని పోల్చాడు. బాబర్ జిడ్డూ బ్యాటింగ్‌తో మరో ఎండ్‌లో దూకుడుగా ఆడబోయి రిజ్వాన్, ఫకార్ జమాన్, సల్మాన్ అఘా వికెట్లు పారేసుకున్నారు. బాబర్ ఆజామ్ దూకుడుగా ఆడకున్నా కనీసం 100 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేసినా ఫలితం మరోలా ఉండేది. కానీ పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న బాబర్ ఆజామ్.. హాఫ్ సెంచరీ నమోదు చేయాలనే లక్ష్యంతోనే బ్యాటింగ్ చేసినట్లు కనిపించింది.