Travis Head : బాబూ హెడ్… ఏంటా బాదుడు.. వరల్డ్ కప్ లో బౌలర్లకు హెడేక్ ఖాయం
ఐపీఎల్ (IPL) లో విధ్వంసకర బ్యాటింగ్ తో ట్రావిస్ హెడ్ (Travis Head) దుమ్ము రేపుతున్నాడు. బౌలర్లంటె ఏ మాత్రం కనికరం లేకుండా విరుచుకు పడుతున్నాడు.

Babu head... Enta Badudu.. Headache is certain for the bowlers in the World Cup
ఐపీఎల్ (IPL) లో విధ్వంసకర బ్యాటింగ్ తో ట్రావిస్ హెడ్ (Travis Head) దుమ్ము రేపుతున్నాడు. బౌలర్లంటె ఏ మాత్రం కనికరం లేకుండా విరుచుకు పడుతున్నాడు. మ్యాచ్ మ్యాచ్ కూ అతని జోరు పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. మొదట ముంబై జట్టుపై…మొన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) జట్టుపై …తాజాగా ఢిల్లీ కాపిటల్స్ ( Delhi Capitals) పైనా హెడ్ రెచ్చిపోయాడు. ఢిల్లీ తో మ్యాచ్ లో అయితే పూనకం వచ్చినట్టు సిక్సర్ల వర్షం కురిపించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేసిన బ్యాటర్‌గా ట్రావిస్ హెడ్.. అభిషేక్ శర్మ సరసన నిలిచాడు. ఓవరాల్‌గా ఐపీఎల్‌లో నాలుగో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. పవర్ ప్లేలో ట్రావిస్ హెడ్‌కు ఇది మూడో ఐపీఎల్ హాఫ్ సెంచరీ.
ఓవర్‌కు దాదాపు 21 రన్‌రేట్ చొప్పున పరుగులు రాబట్టాడు. కేవలం 32 బంతుల్లో 89 రన్స్ బాదాడు. దీంతో హైదరాబాద్ స్కోరు 300 దాటుతుందని అందరూ భావించారు. అయితే, కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో 89 పరుగుల వద్ద హెడ్ ఔట్ అయ్యాడు. అయితే ఫాన్స్ కు ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలయింది. ఐపీఎల్.లో ఆడుతున్నాడు కాబట్టి మనం సపోర్ట్ చేస్తున్నాం…సరిగ్గా నెలన్నర తర్వాత ఇదే హెడ్ వరల్డ్ కప్ లో మన ప్రత్యర్థిగా ఉండబోతున్నాడు. అందుకే ఫాన్స్ లో ఆందోళన…హెడ్ ఇలాగే ఆడితే ఇంక వరల్డ్ కప్ ఆశలు గల్లంతేనని ఫాన్స్ టెన్షన్ పడుతున్నారు. మన బౌలింగ్ కు ఈ ఆసీస్ క్రికెటర్ బాగానే అలవాటు పడ్డాడు. గత ఏడాది వన్డే ప్రపంచ కప్ లోనూ హెడ్ అదరగొట్టేసాడు. ఇప్పుడు అదే ఫామ్ కొనసాగించడం బౌలర్లకు హెడేక్ గా మారిపోయాడని ఫాన్స్ భయపడుతున్నారు.