Bangalore : ప్లే ఆఫ్స్ లో బెంగుళూరు…
మహిళల ప్రీమియర్ లీగ్ (Women's Premier League) లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లే ఆఫ్స్ కు చేరింది.

Bangalore in the play-offs
మహిళల ప్రీమియర్ లీగ్ (Women’s Premier League) లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లే ఆఫ్స్ కు చేరింది. ప్లే రేసులో నిలవాలంటే గెలవాల్సిన చివరి లీగ్ మ్యాచ్‌లో స్మృతి మంధాన నాయకత్వంలోని ఆర్‌సీబీ జట్టు అదరగొట్టింది. ఏడు వికెట్లతో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌ను ఓడించిన బెంగళూరు చివరిదైన మూడో ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ముంబై ఇండియన్స్ (Mumbai Indians) 19 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌట్‌కాగా… బెంగళూరు 15 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసి గెలిచింది. ఆ్రస్టేలియా స్టార్ ఆల్‌రౌండర్ ఎలీస్ పెరీ అద్భుత ఆటతీరుతో 6 వికెట్లు పడగొట్టింది. అనంతరం బ్యాట్‌తో అదరగొట్టి 38 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో అజేయంగా 40 పరుగులు చేసింది.