Bangalore VS Bengal: భరోసాతో బెంగళూరు.. భారంతో బెంగాల్ జట్టు..

ఫాఫ్ డు ప్లెసిస్ నేతృత్వంలోని RCB నేటి మ్యాచ్‌లో నైట్ రైడర్స్‌ను ఓడించినట్లయితే మొదటి మూడు స్థానాల్లోకి ప్రవేశిస్తుంది. మూడు సార్లు IPL ఫైనలిస్టులుగా పేరున్న ఆర్ సి బి, ఈ సీజన్లో ఎనిమిది పాయింట్లతో, పట్టికలో ఐదవ స్థానంలో ఉన్నారు. బెంగళూరులోని ఇదే వేదికపై గతంలో జరిగిన మ్యాచ్‌లో ఆర్ సి బి, రాజస్థాన్ రాయల్స్ ని ఏడు పరుగుల తేడాతో ఓడించింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 26, 2023 | 02:45 PMLast Updated on: Apr 26, 2023 | 2:45 PM

Bangalore Vs Bengal Teams Play Game

మొదట బ్యాటింగ్‌కు దిగిన తర్వాత, ట్రెంట్ బౌల్ట్ ఇద్దరి బ్యాటర్లను వెంట వెంటనే అవుట్ చేయడంతో ఆర్సీబీ చిక్కుల్లో పడింది. కానీ, డుప్లెసిస్, గ్లెన్ మాక్స్‌వెల్ మధ్య 127 పరుగుల భాగస్వామ్యం ఆర్సీబీ ఇన్నింగ్స్‌ను తిరిగి ట్రాక్‌లోకి తెచ్చింది. డుప్లెసిస్ 39 బంతుల్లో 62 పరుగులు చేసినప్పటికీ, మ్యాక్స్‌వెల్ 44 బంతుల్లో ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 77 పరుగులు చేశాడు. ఈ ఇరువురి విధ్వంసం నేపథ్యంలో, రాజస్థాన్ రాయల్స్ ఛేజింగ్ కోసం ఆర్సీబీ 190 పరుగుల లక్ష్యాన్ని పోస్ట్ చేసింది. ఆ తర్వాత, హర్షల్ పటేల్ మూడు వికెట్లు, మహ్మద్‌ సిరాజ్‌, డేవిడ్‌ విల్లీ ఒక్కో వికెట్‌ తీశారు.

దేవదత్ పడిక్కల్ 34 బంతుల్లో 52 పరుగులు చేశాడు, కానీ రాయల్స్ కోసం అతని సాహసోపేతమైన ప్రయత్నాలు ఆర్ ఆర్ జట్టును గెలిపించలేకపోయాయి. ఇక నైట్ రైడర్స్ వారి మొదటి మూడు గేమ్‌లలో రెండింట్లో గెలిచారు, కానీ తమ చివరి నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోవడంతో నితీష్ రాణా సేన పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి చేరుకునే ప్రమాదం ఉంది. వారు నాలుగు పాయింట్లు మరియు నికర రన్ రేట్ -0.186తో ఎనిమిదో స్థానంలో ఉన్నారు. లాస్ట్ మ్యాచులో చెన్నై 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోరును ఛేదించడంలో కలకత్తా పెద్దగా తడబడింది.

ఛేజింగ్ లో జాసన్ రాయ్ 26 బంతుల్లో ఐదు ఫోర్లు, సిక్సర్లతో 61 పరుగులు చేశాడు. రింకూ సింగ్ కూడా 33 బంతుల్లో మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 53 పరుగులు చేశాడు. అయినా కూడా నైట్ రైడర్స్ ఎనిమిది వికెట్ల నష్టానికి 186 పరుగులు చేయడంతో వారి ప్రయత్నాలు ఫలించలేదు. ఆండ్రీ రస్సెల్, నారాయణ్ జగదీశన్, సునీల్ నరైన్ మరియు డేవిడ్ వైస్ లు సరైన సమయంలో జట్టును ఆదుకోలేకపోవడం కె కె ఆర్ జట్టుకు పెద్ద మైనస్ గా మారింది. నైట్ రైడర్స్‌తో జరిగే మ్యాచ్‌లో ఆర్సీబీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని క్రికెట్ క్రిటిక్స్ కూడా నమ్ముతున్నారు. కె కె ఆర్ జట్టులో అద్భుతాలు జరిగితే తప్ప, విరాట్ కంపెనీని ఓడించడం కష్టతరం.