India Vs Bangladesh: మూసుకుని పోరా బంగ్లా ఆటగాళ్లకు టీమిండియా కెప్టెన్ ధమ్కీ
ఏసీసీ పురుషుల ఎమర్జింగ్ కప్ 2023లో భారత్ ఫైనల్ చేరింది. శుక్రవారం బంగ్లాదేశ్-ఏతో జరిగిన సెమీ ఫైనల్లో భారత్-ఏ 51 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

Bangladesh batsman Soumya was dismissed by Yuvrajsinh Dodia, Harshit Rana came to Soumya's face and celebrated the wicket
సెమీ ఫైనల్లో భారత్ బ్యాటింగ్ సమయంలో వికెట్ పడిన ప్రతీసారి బంగ్లాదేశ్ ఆటగాళ్లు అతి చేశారు. టీమిండియా బ్యాటర్లపై ఏదో ఒక కామెంట్ చేస్తూ.. పెవిలియన్ సిగ్నల్ పదే పదే చూపించారు. ఒక్కసారి వారి చర్యలు శ్రుతి మించాయి. అయితే భారత యువ ఆటగాళ్లు మాత్రం ఏమీ అనకుండా ఓపిక పట్టారు. టైం వచ్చినప్పుడు చూద్దాం అన్నట్లు కామ్‌గా ఉన్నారు.
బంగ్లాదేశ్ సీనియర్ బ్యాటర్ సౌమ్యా సర్కార్.. యువరాజ్‌సిన్హ్ దోదియా వేసిన 26వ ఓవర్‌లో ఔట్ అయ్యాడు. కీలక వికెట్ కావడంతో టీమిండియా యువ ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. హర్షిత్ రానా అయితే సౌమ్యా మొహం ముందు గట్టిగా అరుస్తూ, పంచ్‌లు గుద్దుతూ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇది చూసిన సౌమ్యా.. హర్షిత్‌తో గొడవకు దిగాడు. పెవిలియన్ వెళ్తున్న సమయంలోనూ హర్షిత్‌పై సౌమ్యా మాటల యుద్దం కొనసాగించాడు. భారత కెప్టెన్ యష్ దుల్ ఔటైన సమయంలో సౌమ్యా శ్రుతి మించడమే ఈ గొడవకు అసలు కారణం.