Bangladesh: అసలు ప్లేయర్ లేకుండానే బంగ్లా వరల్డ్ కప్ జట్టు ప్రకటన..!
బంగ్లాదేశ్ టీమ్‌ను షకిబ్ అల్ హాసన్ నడిపించనుండగా.. నజ్ముల్ హుసేన్ షాంటో వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. 15 మందితో కూడిన ఈ జట్టులో ముష్ఫికర్ రహీమ్, లిటన్ దాస్ వంటి అనుభవజ్ఞులైన వికెట్ కీపర్-బ్యాటర్లతో పాటు మెహిదీ హాసన్ మిరాజ్ వంటి ఆటగాళ్లకు కూడా అవకాశం దక్కింది.

Bangladesh: వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ కోసం బంగ్లాదేశ్ తమ జట్టును ప్రకటించింది. భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి జరిగే మెగా టోర్నీలో బంగ్లాదేశ్ టీమ్‌ను సీనియర్ ఆల్‌రౌండర్ షకిబ్ అల్ హాసన్ నడిపించనుండగా.. నజ్ముల్ హుసేన్ షాంటో వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. 15 మందితో కూడిన ఈ జట్టులో ముష్ఫికర్ రహీమ్, లిటన్ దాస్ వంటి అనుభవజ్ఞులైన వికెట్ కీపర్-బ్యాటర్లతో పాటు మెహిదీ హాసన్ మిరాజ్, మెహదీ హాసన్, షోరిఫుల్ ఇస్లాం వంటి ఆటగాళ్లకు కూడా అవకాశం దక్కింది.
అయితే వన్డే వరల్డ్ కప్ టోర్నీ బరిలోకి దిగిన బంగ్లాదేశ్ జట్టులో మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బల్ వంటి సీనియర్ ప్లేయర్‌కి అవకాశం దక్కలేదు. కెప్టెన్ షకిబ్ అల్ హాసన్‌తో తమీమ్‌కి ఉన్న విబేధాలే ఇందుకు కారణమని తెలుస్తోంది. అక్టోబర్ 5 నుంచి జరిగే వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు జరిగే వార్మప్ మ్యాచ్‌ల్లో శ్రీలంక, ఇంగ్లాండ్‌తో బంగ్లాదేశ్ జట్టు తలపడుతుంది. ఆ తర్వాత అంటే అక్టోబర్ 7న ఆఫ్గాన్‌తో జరిగే మ్యాచ్ ద్వారా బంగ్లా జట్టు తన వరల్డ్ కప్ కాంపెయిన్‌ని ప్రారంభిస్తుంది.