IPL 2024: ఐపీఎల్ ప్రదర్శన ప్రామాణికం కాదు.. స్టార్ ప్లేయర్స్‌కు బీసీసీఐ షాక్
ఐపీఎల్ ముగిసిన వెంటనే టీ ట్వంటీ ప్రపంచ కప్ అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరగనుంది. దీంతో సెలక్టర్లు ఐపీఎల్‌లో ఇచ్చిన ప్రదర్శననే పరిగణలోకి తీసుకుంటారని చాలా మంది ప్లేయర్స్ భావించారు.

IPL 2024: రాబోయే ఐపీఎల్ సీజన్‌లో సత్తా చాటి టీ ట్వంటీ ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోవాలని ఎదురుచూస్తున్న పలువురు క్రికెటర్లకు బీసీసీఐ షాక్ ఇచ్చింది. మెగా టోర్నీ కోసం జట్టును ఎంపిక చేసే క్రమంలో ఐపీఎల్ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకోబోమని బీసీసీఐ చెప్పినట్లు సమాచారం. ఇది చాలా మంది యువ ఆటగాళ్లతో పాటు సీనియర్ ఆటగాళ్లను ఆందోళనకు గురిచేస్తోంది. ఐపీఎల్ ముగిసిన వెంటనే టీ ట్వంటీ ప్రపంచ కప్ అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరగనుంది.
Rohit Sharma: రోహిత్‌ను కెప్టెన్‌గా కొనసాగించాల్సింది.. ముంబై నిర్ణయాన్ని తప్పుపట్టిన యూవీ
దీంతో సెలక్టర్లు ఐపీఎల్‌లో ఇచ్చిన ప్రదర్శననే పరిగణలోకి తీసుకుంటారని చాలా మంది ప్లేయర్స్ భావించారు. అయితే కేవలం ఐపీఎల్ ఆటతీరునే ప్రామాణికంగా తీసుకుంటే ఫలితం ఉండదని గమనించిన సెలక్టర్లు అంతకుముందు దేశవాళీ క్రికెట్ మ్యాచ్‌ల ప్రదర్శనను కూడా పరిగణలోకి తీసుకుంటారని తెలుస్తోంది. టీ ట్వంటీ ప్రపంచకప్‌కు టీమిండియాను ఎంపిక చేయడానికి ఆటగాళ్ళ దేశవాళీ టోర్నీల ఆటతీరు, ఫిట్‌నెస్ వంటివి కీలకం కానున్నాయి. నిజానికి ఐపీఎల్‌లో బాగా ఆడినా ఒక బోనస్‌గా నిలుస్తుందే తప్ప పూర్తిగా అదే ప్రామాణికం కాదని బోర్డు వర్గాలు చెబుతున్నాయి. దీంతో దేశవాళీ క్రికెట్ కంటే ఐపీఎల్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న భారత ఆటగాళ్లకు ఇది షాకింగ్ న్యూస్‌గా చెప్పొచ్చు.
ఇటీవలే కొందరు ఆటగాళ్ళు రంజీలకు దూరంగా ఉంటూ ఐపీఎల్ సీజన్ సమయానికి సిద్ధమవుతుండడం కూడా దీనికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులకు చెక్ పెట్టేందుకు, దేశవాళీ క్రికెట్‌కు ప్రాధాన్యత ఇచ్చేందుకు ఇది మంచి నిర్ణయంగా అభివర్ణిస్తున్నారు.