BCCI: అమ్మాయిల ఆటతో బీసీసీఐకి కాసుల పంట.. రూ.377 కోట్ల లాభం..

మహిళల క్రికెట్‌ని మరింత ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఈ ఏడాది ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌ని ప్రారంభించారు. ఈ ఏడాది మార్చిలో ముంబైలో రెండు వేదికలపై జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ బీసీసీఐకి కాసుల వర్షం కురిపించింది. తొలి సీజన్‌లోనే రికార్డు స్థాయిలో బీసీసీఐకి రూ.377.49 కోట్ల ఆదాయాన్ని సంపాదించిపెట్టింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 26, 2023 | 03:38 PMLast Updated on: Sep 26, 2023 | 3:38 PM

Bcci Earned Rs 377 49 Cr Revenue From Wpl Increase In Revenue After Covid Slump

BCCI: మన దేశంలో క్రికెట్‌కి ఎంత క్రేజ్ ఉందనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రికెట్‌ని ఒక మతంలా భావించే అభిమానులు మన దేశంలో చాలా మంది ఉన్నారు. అయితే క్రమంగా బీసీసీఐ మహిళల క్రికెట్‌ని ప్రోత్సహిస్తూ వచ్చింది. దానికి తగ్గట్లుగానే మహిళల క్రికెట్‌కి ఎప్పటికప్పుడు ఆదరణ పెరుగుతూ వచ్చింది. మిథాలీ రాజ్, హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మందాన లాంటి ప్లేయర్లు తమ ఆటతో మంచి ఫాలోయింగ్ సంపాదించారు.

మహిళల క్రికెట్‌ని మరింత ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఈ ఏడాది ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌ని ప్రారంభించారు. ఈ ఏడాది మార్చిలో ముంబైలో రెండు వేదికలపై జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ బీసీసీఐకి కాసుల వర్షం కురిపించింది. తొలి సీజన్‌లోనే రికార్డు స్థాయిలో బీసీసీఐకి రూ.377.49 కోట్ల ఆదాయాన్ని సంపాదించిపెట్టింది. బీసీసీఐ కోశాధికారి ఆశిష్ షెలార్ నివేదిక ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను WPL ద్వారా బోర్డు రూ.377.49 కోట్ల ఆదాయాన్ని ఆర్జించినట్లుగా సోమవారం వెల్లడించాడు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో BCCI మొత్తం ఆదాయంలో WPL నుంచి వచ్చిన మిగులు 6% అని షెలార్ నివేదికలో తెలియజేశాడు.

ఈ కాలంలో BCCI ఆదాయంలో 37% ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి, 38% మీడియా హక్కుల విక్రయం ద్వారా వచ్చింది. పురుషుల అంతర్జాతీయ పర్యటనల నుంచి 10% సంపాదించింది. కాగా.. ఇటీవలే క్రికెట్‌లో వార్షిక వేతనం పురుషులతో సమానంగా మహిళలకు ప్రకటిస్తూ గొప్ప నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.