ఆస్ట్రేలియా టూర్ లో భారత్ ఘోరపరాజయంపై ఇప్పటికే మాజీలు, అభిమానులు మండిపడుతున్నారు. సీనియర్ క్రికెటర్ల బ్యాటింగ్ వైఫల్యంతో పాటు గంభీర్ సరైన ప్లానింగ్ తో జట్టును సన్నద్ధం చేయలేదన్న విమర్శలు వినిపించాయి. తొలి టెస్ట్ గెలిచిన తర్వాత మిగిలిన మ్యాచ్ లలో చేతులెత్తేయడంపైనా అసంతృప్తి వ్యక్తమైంది. దీంతో గంభీర్ పై బీసీసీఐ ఆగ్రహంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ సిరీస్ పరాజయంపై బీసీసీఐ రివ్యూ చేస్తుందని, కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ను వివరణ కోరుతుందని ప్రచారం జరిగింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, సహాయక సిబ్బందిపై చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అలాంటిదేమీ లేదని ఓ బీసీసీఐ అధికారి మీడియాకు తెలిపారు. కోహ్లీ, రోహిత్ ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ కూడా ఆడుతారని సదరు అధికారి స్పష్టం చేశారు. టీమిండియా ప్రదర్శనపై బీసీసీఐ రివ్యూ చేస్తుందని, ఎవరిపై చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఎవర్నీ జట్టులో నుంచి తీసేయరనీ, బ్యాటర్ల వైఫల్యానికి హెడ్ కోచ్ ఏం చేస్తాడంటూ ప్రశ్నించారు. గౌతమ్ గంభీరే కోచ్‌గా కొనసాగుతాడనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా జట్టులోనే కొనసాగుతారన్నారు. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ కూడా ఆడుతారనీ, ప్రస్తుతం టీమిండియా ఫోకస్ అంతా ఛాంపియన్స్ ట్రోఫీపైనే ఉందని చెప్పారు. ఆసీస్ టూర్ లో కోహ్లీ, రోహిత్ ఇద్దరూ నిరాశపరిచారు. దీంతో వీరి రిటైర్మెంట్ పై వార్తలు వచ్చాయి. అదే సమయంలో బీసీసీఐ కూడా కఠిన నిర్ణయాలు తీసుకోవాలని, టెస్ట్ ఫార్మాట్ కు మంచి జట్టును రెడీ చేయాలంటూ పలువురు సూచించారు. అయితే ప్రస్తుతానికి బీసీసీఐ ఆ దిశగా ఆలోచించడం లేదని తెలుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాతే దీనిపై దృష్టి పెట్టే ఛాన్సుంది. ఇదిలా ఉంటే పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఛాంపియన్స్ ట్రోఫీ ఆడనున్నారు. ఈ టోర్నీకి ముందు టీమిండియా సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌తో పాటు మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్, కోహ్లీ.. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌తో మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టనున్నారు. ఇంగ్లండ్‌తో సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీక కోసం భారత జట్టును ఒకేసారి ప్రకటించనున్నారు.[embed]https://www.youtube.com/watch?v=oNLRviEkjN4[/embed]