Jasprit Bumrah: గాయాల నుంచి కోలుకుంటున్న స్టార్ ప్లేయర్స్..
గాయాల నుంచి కోలుకుంటున్న జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ ఫిట్‌నెస్ లెవల్స్‌పై బీసీసీఐ అప్‌డేట్ ఇచ్చింది. ఏడాదికి పైగా క్రికెట్‌కు దూరమైన జస్ప్రీత్ బుమ్రా అతి త్వరలోనే క్రికెట్ మైదానంలో అడుగు పెట్టనున్నాడు.

BCCI gave an update on the fitness of Jasprit Bumrah and Rushabh Pant
రిహాబిలిటేషన్‌లో ఆఖరి దశలో ఉన్నాడు. నెట్‌లో అత్యంత తీవ్రతతో బౌలింగ్ చేస్తున్నాడు. ఈ యువ ఫాస్ట్ బౌలర్ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఫిట్‌నెస్ పెంచుకున్నాడు. జస్ప్రీత్ బుమ్రాతో కలిసి ఎన్‌సీఏ నిర్వహించే ప్రాక్టీస్ మ్యాచుల్లో ఆడనున్నాడు. బీసీసీఐ వైద్య బృందం వీరి ప్రోగ్రెస్‌పై సంతృప్తి వ్యక్తం చేసింది. ప్రాక్టీస్ మ్యాచుల తర్వాత నిర్ణయం తీసుకోనుంది. ఐపీఎల్ మధ్యలో గాయపడి ఎన్‌సీఏకు వచ్చాడు రాహుల్.
శస్త్రచికిత్స తర్వాత కోలుకొని ఫిట్‌నెస్ సాధించాడు. స్ట్రెంత్, ఫిట్‌నెస్ డ్రిల్స్ చేస్తున్నాడు. రాబోయే రోజుల్లో అతడి స్కిల్స్, స్ట్రెంత్, కండీషనింగ్‌పై బీసీసీఐ దృష్టి సారించనుంది. ఐపీఎల్‌కు ముందే శ్రేయస్ గాయపడ్డాడు. వెన్నెముక శస్త్రచికిత్స తర్వాత ఫిట్‌నెస్ అందుకున్నాడు. రాహుల్‌తో పాటు ప్రతి రోజూ స్ట్రెంత్, కండీషనింగ్, స్కిల్ ట్రైనింగ్ పొందుతున్నాడు. నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తున్నాడు. యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ అందరి అంచనాలను తలకిందులు చేస్తున్నాడు. కారు ప్రమాదం తర్వాత ఫాస్ట్‌గా కోలుకున్నాడు. ఎన్‌సీఏలో ప్రత్యేకంగా రూపొందించిన ఫిట్‌నెస్ ప్రోగ్రామ్‌లో పాల్గొంటున్నాడు. కీపింగ్, బ్యాటింగ్ చేస్తున్నాడు.