NCAతోనే వీవీఎస్ లక్ష్మణ్ మరో ఏడాది పదవీకాలం పొడిగింపు

NCA Laxman
భారత క్రికెట్ కు కీలకంగా ఉన్న నేషనల్ క్రికెట్ అకాడమీ చీఫ్ గా హైదరాబాదీ మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ నే కొనసాగించాలని బీసీసీఐ నిర్ణయించింది. నిజానికి లక్ష్మణ్ మూడేళ్ల కాంట్రాక్ట్ సెప్టెంబరుతో ముగియనుంది. అయితే ఎన్‌సీఏ హెడ్‌గా మరో ఏడాది కాలం పాటు అతడి పదవీకాలాన్ని పొడిగించాలని బీసీసీఐ భావిస్తోంది. బెంగళూరు శివార్లలో బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కొత్త ఎన్‌సీఏ 2025లో ప్రారంభం కానున్న నేపథ్యంలో లక్ష్మణ్ కొనసాగితే బాగుంటుందనేది బోర్డు ఆలోచన. లక్ష్మణ్ ఈ బాధ్యతల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఐపీఎల్ టీమ్స్ కు మెంటార్ గా కూడా వెళతాడని అంతా అనుకున్నారు. అయితే ఇప్పుడు బీసీసీఐ జోక్యంతో ఎన్‌సీఏ హెడ్‌గానే కొనసాగనున్నాడు.