VVS Laxman: కోచ్ గా లక్ష్మణ్.. కెప్టెన్ గా సూర్య ఊపందుకుంటున్న బీసీసీఐ
వచ్చే 3 నెలలు టీమిండియా వరుస మ్యాచ్‌లతో బిజీబిజీగా ఉండనుంది. దీంతో మెగా టోర్నమెంట్లయిన ఆసియా కప్, ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని.. పలువురు సీనియర్ ప్లేయర్లకు విశ్రాంతినిచ్చేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది బీసీసీఐ.

BCCI is thinking of appointing VVS Laxman as India team coach and Suriya Kumar Yadav as captain for Ireland match
ఇందులో భాగంగా టీ20 కెప్టెన్ హార్దిక్ పాండ్యా, స్టార్ ఓపెనర్ శుభ్‌మాన్ గిల్‌లకు ఐర్లాండ్ సిరీస్‌కు రెస్ట్ ఇస్తారని సమాచారం. ఆగష్టు 13తో ముగిసే వెస్టిండీస్ పర్యటన అనంతరం.. టీమిండియా అదే నెల 18వ తేదీ నుంచి ఐర్లాండ్‌తో టీ20 సిరీస్ ఆడుతుంది. ఈ పొట్టి సిరీస్ కోసం టీ20 రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, ఓపెనర్ గిల్‌కు రెస్ట్ ఇవ్వాలని బీసీసీఐ యోచిస్తోందట. ఆ సిరీస్‌కు కెప్టెన్‌గా హార్దిక్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ జట్టు పగ్గాలు చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఐర్లాండ్ పర్యటనకు భారత్ జట్టు ప్రధాన కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ బాధ్యతలు చేపట్టే ఛాన్స్ ఉందని సమాచారం.