BCCI: టాక్స్ రూ.1159.20 కోట్లు బంగారు బాతుగా బీసీసీఐ
బీసీసీఐ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక పన్నులు చెల్లిస్తున్న క్రీడా సంస్థల్లో రెండో స్థానంలో ఉంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత క్రికెట్ బోర్డు ప్రభుత్వానికి రూ.1159.20 కోట్ల ఆదాయ పన్ను చెల్లించింది. గత 5 సంవత్సరాలలో ఇదే అత్యధికం.
BCCI: కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం బీసీసీఐ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక పన్నులు చెల్లిస్తున్న క్రీడా సంస్థల్లో రెండో స్థానంలో ఉంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత క్రికెట్ బోర్డు ప్రభుత్వానికి రూ.1159.20 కోట్ల ఆదాయ పన్ను చెల్లించింది. గత 5 సంవత్సరాలలో ఇదే అత్యధికం. అలాగే 2020-21 అర్ధిక సంవత్సరం చెల్లించిన పన్నుల కంటే ఇది 37 శాతం ఎక్కువ. గత ఐదేళ్లతో పోలిస్తే 2021-22లో భారత క్రికెట్ బోర్డు అత్యధికంగా రూ.7,606 కోట్ల ఆదాయాన్నిసంపాదించింది.
ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్ బోర్డు కూడా బీసీసీఐదే. అత్యధిక ఆదాయం పొందుతున్నక్రికెట్ సంస్థగా బీసీసీఐకి గుర్తింపు ఉంది. ఇండియాలో క్రికెట్‌కు ఉన్న క్రేజే దీనికి కారణం. క్రికెట్ స్పాన్సర్‌షిప్, ప్రసార హక్కుల ద్వారా బసీసీఐ వేల కోట్లు అర్జిస్తోంది. ఐపీఎల్ కూడా బీసీసీఐ ఆదాయం పెరిగేందుకు కారణం. అందుకే బీసీసీఐ నిర్వహించే టోర్నీల కోసం విదేశీ క్రికెటర్లు కూడా క్యూ కడుతుంటారు. మన దేశం ఇచ్చే ఆఫర్‌ను ఏ క్రీడాకారుడు వద్దనే పరిస్థితి లేదంటే ఆర్థికంగా బీసీసీఐ ఎంత బలమైందో అర్థం చేసుకోవచ్చు. ఆటగాళ్లకు అత్యధిక వేతానాలు, పారితోషికం అందిస్తున్న సంస్థ కూడా ఇదే.