BCCI: వరల్డ్ కప్‌కు ముందు క్రికెట్ స్టేడియంలకు మహర్దశ.. ఆధునికంగా తీర్చిదిద్దనున్న బీసీసీఐ.. ఉప్పల్ స్టేడియానికి ఎన్ని కోట్లంటే

వరల్డ్ కప్ లాంటి అంతర్జాతీయ టోర్నీ నిర్వహించాలంటే అదే స్థాయి ప్రమాణాలు పాటించాలి. స్టేడియంలలో అన్ని ఏర్పాట్లు సక్రమంగా ఉండాలి. ఆటగాళ్లకు, ప్రేక్షకులు, సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలి. సీటింగ్, లైటింగ్, స్క్రీన్స్, వాష్ రూమ్స్ వంటివి పక్కాగా ఉండాలి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 12, 2023 | 01:43 PMLast Updated on: Apr 12, 2023 | 1:43 PM

Bcci Plans Massive Upgrade Ahead Of Odi World Cup

BCCI: ఈ ఏడాది అక్టోబర్‌లో వన్డే వరల్డ్ కప్ జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇవ్వబోతుంది. అంతర్జాతీయ టోర్నీ కాబట్టి, అన్ని ఏర్పాట్లు పక్కాగా ఉండాలి. అందుకే ఈ టోర్నీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీసీసీఐ మ్యాచ్‌లు నిర్వహించే స్టేడియంలను అన్ని రకాలుగా సిద్ధం చేయబోతుంది. ఇప్పటికే టోర్నీ నిర్వహణకు 12 స్టేడియంలను ఎంపిక చేసింది. అయితే, వీటిలో అనేక స్టేడియంలలో పలు లోపాలున్నాయి. అందుకే వీటి మరమ్మతులు, ఆధునికీకరణ కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేందుకు బీసీసీఐ సిద్ధమవుతోంది.
సమస్యల్లో స్టేడియంలు
వరల్డ్ కప్ లాంటి అంతర్జాతీయ టోర్నీ నిర్వహించాలంటే అదే స్థాయి ప్రమాణాలు పాటించాలి. స్టేడియంలలో అన్ని ఏర్పాట్లు సక్రమంగా ఉండాలి. ఆటగాళ్లకు, ప్రేక్షకులు, సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలి. సీటింగ్, లైటింగ్, స్క్రీన్స్, వాష్ రూమ్స్ వంటివి పక్కాగా ఉండాలి. అయితే, కొన్ని స్టేడియంలలో ఇప్పటికీ సీట్లు, రూఫ్‌లు వంటి సరైన సౌకర్యాలు లేవు. ఎండ ఉన్న సమయంలో రూఫ్స్ లేక ప్రేక్షకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దేశంలో ఐపీఎల్ టోర్నీ నిర్వహిస్తున్నప్పటికీ వీటిపై స్థానిక ఫ్రాంచైజీలు, ఆటగాళ్లు ఫిర్యాదు చేసే అవకాశం లేదు. కానీ, వరల్డ్ కప్ టోర్నీ అంటే అనేక దేశాల నుంచి క్రీడాకారులు, మీడియా ప్రతినిధులు హాజరవుతారు. ప్రపంచం దృష్టి అంతా ఈ టోర్నీపైనే ఉంటుంది. అలాంటప్పుడు సరైన సౌకర్యాలు లేకుండా టోర్నీ నిర్వహిస్తే బీసీసీఐతోపాటు, ఇండియాకు అప్రతిష్ట. అందుకే ఎలాంటి లోటుపాట్లు లేకుండా, అంతర్జాతీయంగా పేరొచ్చేలా టోర్నీ నిర్వహించాలనుకుంటోంది. ప్రపంచ క్రికెట్‌లోనే బీసీసీఐ ధనిక బోర్డు. అటు అంతర్జాతీయ టోర్నీలతోపాటు ఐపీఎల్ వంటి టోర్నీల వల్ల బీసీసీఐకి వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తున్న సంగతి తెలిసిందే. అందువల్ల నిధుల కేటాయింపు విషయంలో బీసీసీఐ వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. ఈ టోర్నీ సరిగ్గా నిర్వహిస్తే బీసీసీఐకి మంచి పేరు దక్కుతుంది.

bcci
ఈ స్టేడియాల్లోనే మరమ్మతులు
వరల్ట్ కప్ టోర్నీ నిర్వహణకు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ, ధర్మశాల, గువహటి, కోల్‌కతా, ఇండోర్, రాజ్‌కోట్, లక్నో, ముంబై స్టేడియంలను బీసీసీఐ ఎంపిక చేసింది. అయితే, వీటిలో కొన్ని స్టేడియంలలో సరైన సౌకర్యాలు లేవు. హైదరాబాద్, ఉప్పల్ స్టేడియంలో సీట్లు కూడా సరిగ్గా లేవని అభిమానులు ఫిర్యాదు చేస్తున్నారు. మరికొన్ని స్టేడియంలలో కూడా సరైన వసతులు లేవని అభిమానులు చెతున్నారు. దీంతోపాటు నిర్వహణాపరమైన లోపాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ (ఉప్పల్) స్టేడియం, కోల్‌కతా, ముంబై, మొహలీ, ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలలో సౌకర్యాలు నాసిరకంగా ఉన్నాయని బీసీసీఐ గుర్తించింది. ఇలాంటి చోట్ల టోర్నీ నిర్వహిస్తే అది బీసీసీఐ ప్రతిష్టకు మచ్చగా మిగిలిపోతుంది. దీంతో వీటి మరమ్మతులు, అభివృద్ధి పనులు చేపట్టి స్టేడియంలను సుందరంగా తీర్చిదిద్దాలని బీసీసీఐ భావిస్తోంది.
ఉప్పల్ స్టేడియానికి నిధులు
ఈ స్టేడియంల మరమ్మతులు, ఆధునీకరణ పనుల కోసం బీసీసీఐ రూ.500 కోట్ల వరకు ఖర్చు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో హైదరాబాద్, ఉప్పల్ స్టేడియానికి రూ.117.17 కోట్లు కేటాయించింది. ఈ మేరకు వివిధ పనులకు సంబంధించి వచ్చిన అంచనాల ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో త్వరలోనే ఇక్కడ సీటింగ్ వ్యవస్థ మెరుగుపడనుంది. దీంతోపాటు ఢిల్లీ స్టేడియానికి రూ.100 కోట్లు, ముంబైలోని వాంఖడే స్టేడియానికి రూ.78.82 కోట్లు, మొహాలీలోని పీసీఏ స్టేడియానికి రూ.79.46 కోట్లు, కోల్‌కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్ స్టేడియానికి రూ.127.47 కోట్లు కేటాయించాలని బీసీసీఐ నిర్ణయించింది. వీటిలో రూఫ్స్ కూడా మార్చాలంటే మరిన్ని నిధులు అవసరం కావొచ్చు.

bcci
48 మ్యాచ్‌లు
అక్టోబర్-నవంబర్‌లో వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభమవుతుంది. ఈ టోర్నీలో మొత్తం 48 మ్యాచ్‌లు జరుగుతాయి. ప్రస్తుతానికి 12 స్టేడియంలను ఎంపిక చేసినందున ఒక్కో స్టేడియంలో సగటున 4 మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉంది. ఇండియాలో చివరగా 2011లో వరల్డ్ కప్ జరిగింది. ఈ టోర్నీ ఫైనల్‌లో శ్రీలంకపై ఇండియా విజయం సాధించి, ధోనీ సేన వరల్డ్ కప్ గెలుచుకున్న సంగతి తెలిసిందే.