BCCI: పర్యావరణం కోసం బీసీసీఐ కీలక నిర్ణయం.. వాటిపై నిషేధం..
టపాసులను కాల్చడం వల్ల గాలి కాలుష్యం అవుతోంది. అత్యంత దారుణ గాలి కాలుష్యం ఉండే ఢిల్లీ, ముంబై నగరాల్లో టపాసులను పేల్చడం వల్ల మరింతగా వాతావరణానికి హాని చేసినట్లే అవుతుంది. ఈ అంశంపై పర్యావరణవేత్తలు, అధికారులు, అభిమానుల నుంచి బీసీసీఐకి విజ్ఞప్తులు వచ్చాయి.

BCCI: వన్డే ప్రపంచకప్ 2023లో లైటింగ్ షో, మ్యాచ్ అయ్యాక స్టేడియంలో టపాసులను పేలుస్తూ సంబరాలు నిర్వహిస్తోంది బీసీసీఐ. లైటింగ్ షో వల్ల పెద్దగా నష్టం లేదు కానీ.. టపాసులను కాల్చడం వల్ల గాలి కాలుష్యం అవుతోంది. అత్యంత దారుణ గాలి కాలుష్యం ఉండే ఢిల్లీ, ముంబై నగరాల్లో టపాసులను పేల్చడం వల్ల మరింతగా వాతావరణానికి హాని చేసినట్లే అవుతుంది.
Thangalaan: వెన్నులో వణుకు పుట్టించేలా ‘తంగలాన్’ టీజర్.. విక్రమ్ నట విశ్వరూపం..
ఈ అంశంపై పర్యావరణవేత్తలు, అధికారులు, అభిమానుల నుంచి బీసీసీఐకి విజ్ఞప్తులు వచ్చాయి. దీంతో చివరి నిమిషంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ, ముంబై మైదానాల్లో జరిగే మ్యాచ్‌ల సందర్భంగా టపాసులను కాల్చడంపై బ్యాన్ విధిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా ఓ కీలక ప్రకటన చేశారు. ‘వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ, ముంబై మైదానాలలో టపాసుల ప్రదర్శన నిర్వహించడం లేదు. వాతావరణ సమస్యలపై బీసీసీఐ కూడా తన వంతు కృషి చేస్తుంది.
PAWAN KALYAN: ఓజీ కథ లీక్.. పవన్ ఫ్యాన్స్‌కు పండుగే!
ఇదే విషయాన్ని ఐసీసీకి వివరించాం. వన్డే ప్రపంచకప్‌ను అద్భుతంగా నిర్వర్తించడం వల్ల భవిష్యత్తులో క్రికెట్‌కు అదనపు ప్రయోజనం చేకూరనుంది. అదే సమయంలో అభిమానులు, ఆటగాళ్లు, ప్రజల ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. అందుకే ఫైర్ వర్క్స్‌ను నిలిపివేస్తున్నాం’ అని జై షా తెలిపారు. బీసీసీఐ నిర్ణయంపై పర్యావరణవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.