TEAM INDIA: ఇకపై టెస్టుకు 20 లక్షలు.. మ్యాచ్ ఫీజు భారీగా పెంపు..?
టీమిండియాలోకి తిరిగి రావాలంటే కచ్చితంగా రంజీల్లో ఆడాలన్న బోర్డు ఆదేశాలను ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ వంటి స్టార్ ఆటగాళ్లు ధిక్కరించారు. బీసీసీఐ ఆదేశాలను భేఖాతర్ చేసి వీరిద్దరూ రంజీల్లో ఆడకుండా తప్పించుకున్నారు.
TEAM INDIA: ఆటగాళ్ల మ్యాచ్ ఫీజుల విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. టెస్ట్ మ్యాచ్ ఫీజును భారీగా పెంచాలని భావిస్తోంది. టీమిండియాలోకి తిరిగి రావాలంటే కచ్చితంగా రంజీల్లో ఆడాలన్న బోర్డు ఆదేశాలను ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ వంటి స్టార్ ఆటగాళ్లు ధిక్కరించారు. బీసీసీఐ ఆదేశాలను భేఖాతర్ చేసి వీరిద్దరూ రంజీల్లో ఆడకుండా తప్పించుకున్నారు. అదే సమయంలో ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ మొదలుపెట్టారు.
Dhruv Jurel: జురెల్‌కు ఎంజీ మోటార్స్ గిఫ్ట్.. కారు విలువ ఎంతంటే..
ఈ నేపథ్యంలో అయితే, రెడ్ బాల్ క్రికెట్‌పై ఆటగాళ్లకు ఆసక్తి పెంచేందుకు కీలక నిర్ణయం దిశగా బీసీసీఐ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆటగాళ్ల టెస్ట్ మ్యాచ్ ఫీజులను పెంచే ఆలోచనలో ఉంది. బీసీసీఐ ప్రస్తుతం ఒక్కో టెస్టుకు మ్యాచ్ ఫీజుగా రూ.15 లక్షలు, వన్డేకు రూ.6 లక్షలు, టీ20 మ్యాచ్‌లకు రూ.3 లక్షలు చెల్లిస్తోంది. అయితే ఇప్పుడు టెస్టు మ్యాచ్ ఏకంగా రూ.20 లక్షలకు పెంచే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్టు సమాచారం. కొత్త రెమ్యునరేషన్ మోడల్ ఐపీఎల్ 2024 సీజన్ తర్వాత అమలులోకి వచ్చే ఛాన్స్ ఉంది.
ఏ ఆటగాడైనా క్యాలెండర్ ఈయర్‌లో మొత్తం అన్ని సిరీస్‌లలోనూ భాగమమైతే.. అతడికి వార్షిక కాంట్రాక్ట్ రిటైన్‌తో పాటు అదనంగా రివార్డ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నామని బోర్డు అధికారి ఒకరు తెలిపారు. ఈ నిర్ణయంతో టెస్ట్ క్రికెట్ ఆడేందుకు ఆటగాళ్లు ఆసక్తి చూపుతారని భావిస్తున్నామని వెల్లడించారు.