ఫ్యామిలీస్ కు నో ఎంట్రీ ఐపీఎల్ ప్లేయర్స్ కు బీసీసీఐ షాక్

ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందు బీసీసీఐ ఆటగాళ్ళకు షాకిచ్చింది. ఈ సీజన్ నుంచి కొత్త రూల్స్ ను తీసుకొచ్చింది. ఇకపై డ్రెస్సింగ్ రూమ్ లోకి ఆటగాళ్ళ కుటుంబసభ్యులకు అనుమతి ఉండదని స్పష్టం చేసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 6, 2025 | 07:10 PMLast Updated on: Mar 06, 2025 | 7:10 PM

Bcci Shocks Ipl Players With No Entry For Families

ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందు బీసీసీఐ ఆటగాళ్ళకు షాకిచ్చింది. ఈ సీజన్ నుంచి కొత్త రూల్స్ ను తీసుకొచ్చింది. ఇకపై డ్రెస్సింగ్ రూమ్ లోకి ఆటగాళ్ళ కుటుంబసభ్యులకు అనుమతి ఉండదని స్పష్టం చేసింది. మార్చి 22 నుంచి ఐపీఎల్ సీజన్ ఆరంభం కానుండగా కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలను ఫ్రాంచైజీలకు పంపించింది. ఇటీవ‌లే భార‌త జ‌ట్టు పై ఆంక్ష‌లు విధించగా.. ఇప్పుడు ఐపీఎల్ ఆట‌గాళ్ల పైనా కూడా దాదాపుగా అవే ఆంక్ష‌లు కొన‌సాగ‌నున్నాయి. ఆట‌గాళ్లు అంద‌రూ కూడా ప్రాక్టీస్ లేదా మ్యాచ్‌ల కోసం స్టేడియాల‌కు వెళ్లే స‌మ‌యంలో ఖ‌చ్చితంగా టీమ్ బ‌స్సులోనే ప్ర‌యాణించాల‌ని సూచించింది. ఇప్ప‌టికే భార‌త ఆట‌గాళ్ల‌కు ఈ నిబంధ‌న అమలు చేస్తోంది.

ఆటగాళ్లు, సహాయక సిబ్బంది కుటుంబ సభ్యులను డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి అనుమతించకూడదని బీసీసీఐ నిర్ణయించింది. ప్రాక్టీస్‌ రోజుల్లోనూ దీన్ని కొనసాగించాలని సూచించింది. అనుమతించిన సిబ్బంది మినహా డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి మరెవరికీ ప్రవేశం కల్పించకూడదని ప్రకటించింది. ప్లేయర్ల స్నేహితులు, సన్నిహితులు ఇతర వాహనాల్లో ప్రయాణిస్తూ… హాస్పిటాలిటీ ప్రాంతం నుంచి మ్యాచ్‌ ప్రాక్టీస్‌ చూడొచ్చు. నెట్‌ బౌలర్లు, త్రోడౌన్‌ స్పెషలిస్ట్‌లు కూడా బీసీసీఐ నుంచి అనుమతి తీసుకోవాల్సిందే. ఐపీఎల్‌ సందర్భంగా ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదని పేర్కొన్న బీసీసీఐ… ఆరెంజ్‌ క్యాప్‌, పర్పుల్‌ క్యాప్‌ సాధించిన ఆటగాళ్లు మ్యాచ్‌ ఆరంభంలో కనీసం రెండు ఓవర్ల పాటైనా వాటిని ధరించాలని
సూచించింది.

ఇక మ్యాచ్‌ అనంతరం బహుమతి ప్రదానోత్సవంలో ప్లేయర్లు స్లీవ్‌లెస్‌ జెర్సీలను ధరించకూడదని బీసీసీఐ ఆదేశించింది. ఐపీఎల్ సీజ‌న్ లాగానే మ్యాచ్ రోజుల్లో టీమ్ డాక్ట‌ర్‌తో స‌హా 12 మంది గుర్తింపు పొందిన స‌హాయ‌క సిబ్బందికి మాత్ర‌మే అనుమ‌తి ఉంటుంది. అలాగే జెర్సీ నంబ‌ర్ల‌లో ఏవైన మార్పు ఉంటే.. నిబంధనల్లో పేర్కొన్న విధంగా 24 గంట‌ల ముందుగానే తెలియ‌జేయాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే
మార్చి 22 నుంచి కోల్‌కతాలో ఐపీఎల్‌ సీజన్‌ ప్రారంభం కానుండగా… దానికి ముందు ఈ నెల 20న కెప్టెన్ల సమావేశం జరగనుంది. సాధారణంగా తొలి మ్యాచ్‌ జరిగే వేదికలోనే ఈ భేటీ జరుగాల్సి ఉన్నప్పటకీ …ఈసారి అందుకు భిన్నంగా ముంబైలో నిర్వహించనున్నారు. కాగా మార్చి 22న జరిగే ఆరంభ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్ కత్తా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది.