bcci business: డీల్ విత్ అమెజాన్.. గూగుల్ కనకవర్షం కురుస్తుందా?

ఇండియాలో క్రికెట్ అంటే పడి సచ్చే అభిమానులు ఎంతో మంది ఉన్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 3, 2023 | 07:45 PMLast Updated on: Aug 03, 2023 | 7:45 PM

Bcci Will Try To Get Huge Bids From International Companies Like Amazon And Google For The Media Rights Of Team Indias Matches

ఇక ఐపీఎల్, టీ20 మ్యాచ్లంటే క్రికెట్ లవర్స్ టీవీలు, ఫోన్లకే అతుక్కుపోతారు. అంతేకాకుండా భారత్, ఇతర జట్ల మధ్య మ్యాచ్ ఉంటే.. స్టేడియాల్లో కిక్కిరిసిపోతారు. దీంతో బీసీసీఐ భారీ లాభాన్ని ఆర్జిస్తుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకోనుంది. బీసీసీఐ తన ఆదాయ ప్రణాళికలో అమెజాన్, గూగుల్ వంటి కంపెనీలను చేర్చుకోడానికి ప్రణాళికను రూపొందిస్తుంది. ఇప్పటికే ఐపీఎల్ మీడియా హక్కులను విక్రయించి భారీ లాభాలను ఆర్జించిన బీసీసీఐ.. ఇప్పుడు భారత క్రికెట్ జట్టు యొక్క ద్వైపాక్షిక సిరీస్ మ్యాచ్‌ల నుండి కూడా సంపాదించాలని ప్లాన్ చేస్తుంది.

తన బిడ్డింగ్ ద్వారా టీమ్‌ఇండియా ఐదేళ్ల పాటు ఆడే 102 మ్యాచులకు 750 మిలియన్ డాలర్ల మేర డబ్బులు వస్తాయని ఎర్నెస్ట్ అంచనా వేస్తోంది. ఈ మ్యాచ్‌ల మీడియా హక్కుల రేసులో అమెజాన్, గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థలను చేర్చుకోవాలని భావిస్తోన్న బీసీసీఐ.. వేలం ప్రక్రియను రెండు వారాల పాటు వాయిదా వేసింది. 2023 ఐపీఎల్ యొక్క వెబ్ టెలికాస్ట్ హక్కులను రిలయన్స్ కంపెనీ జియో సినిమా కొనుగోలు చేసింది. టీవీ హక్కులు స్టార్ ఇండియా వద్దనే ఉన్నాయి. ఈ డీల్‌తో బీసీసీఐ భారీగానే సంపాదించే దిశగా పావులు కదుపుతోంది.