ISHAN KISHAN: ఇషాన్ కిషన్‌కు బీసీసీఐ షాక్.. రంజీ ట్రోఫీ ఆడితేనే జట్టులోకి ఎంట్రీ
ఇషాన్ కిషన్ రంజీ ట్రోఫీ ఆడకుండా బరోడా వెళ్లి పాండ్యా బ్రదర్స్‌తో ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ చేస్తుండటంపై బోర్డు ఆగ్రహంగా ఉందట. త్వరలోనే గట్టి వార్నింగ్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు కథనాలు వచ్చాయి.
ISHAN KISHAN: బీసీసీఐ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. జాతీయ జట్టు సెలక్షన్‌కు పరిగణలోకి తీసుకోవాలంటే ఏ ఆటగాడైనా దేళవాళీ క్రికెట్ ఆడాల్సిందేనన్న నిబంధనను తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది. ఇషాన్ కిషన్ వ్యవహారశైలితోనే బోర్డు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు సమాచారం. ఇషాన్ కిషన్ రంజీ ట్రోఫీ ఆడకుండా బరోడా వెళ్లి పాండ్యా బ్రదర్స్‌తో ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ చేస్తుండటంపై బోర్డు ఆగ్రహంగా ఉందట.
Suresh Raina, IVPL : రీ ఎంట్రీ ఇస్తున్న సురేష్ రైనా.. ఏ లీగ్ లో ఆడుతున్నాడంటే..
త్వరలోనే గట్టి వార్నింగ్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు కథనాలు వచ్చాయి. గతేడాది నవంబర్ నుంచి టీమిండియాకు ఇషాన్ కిషన్ దూరంగా ఉన్నాడు. అతడు మళ్లీ జట్టులోకి రావాలంటే ఏదో ఒక క్రికెట్ ఆడాలని హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పష్టం చేసినా ఇషాన్ కిషన్ మాత్రం పట్టించుకోలేదు. తన టీమ్ జార్ఖండ్ తరఫున రంజీ ట్రోఫీ బరిలో దిగే అవకాశం ఉన్నా.. ఇషాన్ కిషన్ నో చెప్పాడు. దీంతో బీసీసీఐ అతనిపై గుర్రుగా ఉన్నట్లు సమాచారం. రంజీ ట్రోఫీకి ప్లేయర్స్ అందుబాటులో ఉండకపోవడం ఆశ్చర్యంగా ఉందని పలువురు మాజీలు కూడా వ్యాఖ్యానించాడు.
ఈ నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. ఫిట్‌గా ఉన్న ప్లేయర్స్ అందరూ రంజీ ట్రోఫీలో ఆడాల్సిందేనని నోటీస్ జారీ చేయనున్నట్లు సమాచారం. ఇషాన్ పేరును నేరుగా ప్రస్తావించకుండా కొందరు ప్లేయర్స్ ఇప్పటికే ఐపీఎల్ మోడ్‌లోకి వెళ్లడంపై కూడా బీసీసీఐ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.