Minnu Mani: క్రికెటర్ పేరుతో జంక్షన్ కేరళ టాలెంటెడ్ కు అరుదైన సన్మానం

జులై 9న బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టి20తో మిన్ను మణి అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేసింది. తొలి మ్యాచ్ లోనే అదరగొట్టింది. బంగ్లా బ్యాటర్ షమీమా సుల్తానాను తొలి వికెట్‌గా దక్కించుకుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 25, 2023 | 06:20 PMLast Updated on: Jul 25, 2023 | 6:20 PM

Because Of Minnu Manis Good Performance In International Cricket It Was Decided To Change An Area In Kerala As Minnu Mani Junction

తర్వాతి రెండు మ్యాచ్ లలో వరుసగా 4 ఓవర్లలో కేవలం 9 రన్స్ ఇచ్చి 2 వికెట్లు, 4 ఓవర్లలో 28 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకుంది. సిరీస్ లో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్లలో రెండో స్థానంలో నిలిచింది. మూడు టీ20ల్లో కేవలం 11.6 సగటుతో 5 వికెట్లు తీసింది. కాగా ఈ నెల 14న ప్రత్యేకంగా సమావేశమైన మనంతవాడి మున్సిపల్ కౌన్సిల్.. మైసూరు రోడ్డు జంక్షన్ ను మిన్ను మణి జంక్షన్ గా మార్చాలని నిర్ణయించారు. మిన్నును ఎలా గౌరవించాలా అని ఆలోచించే క్రమంలో ఇలా రోడ్డు జంక్షన్ కు ఆమె పేరు పెట్టాలని నిర్ణయించినట్లు మనంతవాడి మున్సిపల్ ఛైర్ పర్సన్ రత్నవల్లి చెప్పారు.

మనంతవాడిలో మిన్ను ఇంటికి మంచి రోడ్డు వేస్తామని స్థానిక ఎమ్మెల్యే ఓఆర్ కేలు చెప్పారు. మున్సిపల్ రోడ్డు నుంచి 200 మీటర్ల దూరంలో ఆమె ఇల్లు ఉంది. ప్రస్తుతం ఆమె ఇంటికి వెళ్లడానికి సరైన రోడ్డు సౌకర్యం లేదు. త్వరలోనే ఈ రోడ్డు నిర్మాణం పూర్తవుతుందని ఈ సందర్భంగా కేలు హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా మిన్నును సన్మానించేందుకు ప్రత్యేక కార్యక్రమం కూడా మనంతవాడి మున్సిపాలిటీ అధికారులు చేపట్టారు.