Manoj Tiwari: బెంగాల్ స్పోర్ట్స్ మంత్రిగా బిజీ.. క్రికెట్ కు మనోజ్ తివారి రిటైర్మెంట్
టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్, బెంగాల్ క్రీడా మంత్రి మనోజ్ తివారి అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించాడు.

Bengal Sports Minister is busy. Manoj Tiwari retires from cricket
ఇన్‌స్టా వేదికగా తివారి తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించాడు. గత రంజీ సీజన్‌లో బెంగాల్‌ను ఫైనల్ వరకు చేర్చిన తివారి.. ఓ పక్క రాజకీయాలతో బిజీగా ఉంటూనే ఈ ఏడాది ఫిబ్రవరి వరకు దేశవాలీ టోర్నీల్లో బెంగాల్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. 2008-15 మధ్యలో టీమిండియా తరఫున 12 వన్డేలు, 3 టీ20 ఆడిన 37 ఏళ్ల తివారి.. 2011లో విండీస్‌తో జరిగిన చెన్నై వన్డే సెంచరీతో గుర్తింపు తెచ్చుకున్నాడు. తివారి ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ జట్లకు ఆడాడు. క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్నాను. కష్టకాలంలో క్రికెట్ నన్ను అన్ని విధాల ఆదుకుంది. నేను కలలో కూడా ఊహించనివి ఇచ్చింది. ఈ ఆటకు ఎంతో రుణపడి ఉన్నాను. అన్ని సందర్భాల్లో తనతో ఉన్న దేవుడికి కృతజ్ఞుడనై ఉంటాను అంటూ తివారి తన ఇన్‌స్టా పోస్ట్‌లో రాసుకొచ్చాడు.