Uppal Stadium : ఉప్పల్ స్టేడియానికి బెస్ట్ గ్రౌండ్ అవార్డు

రెండు నెలలుగా క్రికెట్ ఫాన్స్ ను ఉర్రూతలూగించిన ఐపీఎల్ 17వ సీజన్ ఘనంగా ముగిసింది. ఫైనల్లో కోల్ కత్తా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ ను ఓడించి మూడోసారి విజేతగా నిలిచింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 27, 2024 | 06:00 PMLast Updated on: May 27, 2024 | 6:00 PM

Best Ground Award For Uppal Stadium

 

 

రెండు నెలలుగా క్రికెట్ ఫాన్స్ ను ఉర్రూతలూగించిన ఐపీఎల్ 17వ సీజన్ ఘనంగా ముగిసింది. ఫైనల్లో కోల్ కత్తా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ ను ఓడించి మూడోసారి విజేతగా నిలిచింది. ఇక హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్‌కు ఉత్తమ పిచ్ అండ్ గ్రౌండ్ అవార్డు దక్కింది. ప్రోత్సాహకంగా 50 లక్షల నగదు లభించింది. ఈ అవార్డును ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ ఛాముండేశ్వరి నాథ్ నుంచి హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌ మోహన్ రావు అందుకున్నారు. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో హెచ్‌సీఏ ఈ సీజన్‌లో ఏడు మ్యాచ్‌లకు ఆతిధ్యం ఇచ్చింది. ఎస్‌ఆర్‌హెచ్-గుజరాత్ టైటాన్స్‌ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. మిగిలిన మ్యాచ్‌లన్నీ ఆసక్తికరంగా సాగాయి. సొంతమైదానంలో ఆర్సీబీతో మ్యాచ్ మినహా మిగిలిన అన్నింట్లో సన్‌రైజర్స్ విజయం సాధించింది.