MS Dhoni : ధోనీ ఇంట్లో కూర్చుంటే బెటర్.. అదేంటి భజ్జీ అంత మాట అన్నావ్

ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగుపర్చుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ అదరగొట్టింది. పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో 28 పరుగుల తేడాతో నెగ్గింది. ఈ గెలుపుతో Bowling పాయింట్స్ టేబుల్లో థర్డ్ ప్లేస్ కు ఎగబాకింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 6, 2024 | 06:30 PMLast Updated on: May 06, 2024 | 6:30 PM

Better If Dhoni Sits At Home Thats What Bhajji Said

 

 

 

ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగుపర్చుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ అదరగొట్టింది. పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో 28 పరుగుల తేడాతో నెగ్గింది. ఈ గెలుపుతో Bowling పాయింట్స్ టేబుల్లో థర్డ్ ప్లేస్ కు ఎగబాకింది. అయితే చెన్నై నెగ్గినా ధోని ఆటతీరుపై విమర్శలు వస్తున్నాయి. నిన్న పంజాబ్ తో మ్యాచ్ లో తొమ్మిదో స్థానంలో ఆడాడు. దీంతో అతడిపై టీమిండియా మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్ తీవ్ర విమర్శలు చేసాడు. ధోనీ ఇలాగే 9వ స్థానంలో బ్యాటింగ్ దిగాలని భావిస్తే అతడి బదులు మంచి బౌలర్ ను టీమ్ లోకి తీసుకుంటే సరిపోతుందన్నాడు. ఆ ప్లేస్ లో ఓ బౌలర్ ను ఆడిస్తే వికెట్లు తీయడంతో పాటు ఆఖర్లో వచ్చి కొన్ని పరుగులు చేస్తాడు అంటూ వ్యాఖ్యానించాడు.

బ్యాటింగ్ ఆర్డర్ లో పైకి వచ్చి ఆడలేనప్పుడు ధోని ఆడటం ఎందుకని ప్రశ్నించాడు. ఇదే కొనసాగించానిఆడటం మానేసి ఇంట్లో కూర్చోవాలని టర్బనేటర్ సూచించాడు. ధోని 9వ స్థానంలో బ్యాటింగ్ కు రావడం చెన్నైకి మంచిది కాదన్నాడు.. కాగా చివరి రెండు, మూడు ఓవర్లు ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చి ధనాధన్ షాట్లతో టీమ్ భారీ స్కోర్లు అందుకోవడానికి హెల్ప్ చేస్తున్నాడు. అయితే మాహీ ఉన్న ఫామ్ కు కాస్త ముందే బ్యాటింగ్ కు వస్తే బాగుండనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ మోకాలి గాయం నుంచి పూర్తిగా రికవరీ అవకపోవడంతో ఫాన్స్ కోసమే అతడు 8 లేదా 9వ స్థానంలో బ్యాటింగ్ కు దిగుతున్నాడనీ కోచ్ ఫ్లెమింగ్ చెప్పుకొస్తున్నాడు.